పరిష్కరించుకునే నేర్పు కావాలి!

భార్యాభర్తల బంధం బాగుండాలంటే ఒకరిపై మరొకరికి ప్రేమ ఉంటేనే సరిపోదు. సర్దుబాట్లు కావాలి. సమస్యల్ని అర్థం చేసుకునే ఓర్పు, వాటిని చాకచక్యంగా పరిష్కరించుకోగలిగే నేర్పు ఉండాలి. అప్పుడే కలకాలం సంతోషంగా ఉండొచ్చు.

Published : 11 Aug 2023 00:08 IST

భార్యాభర్తల బంధం బాగుండాలంటే ఒకరిపై మరొకరికి ప్రేమ ఉంటేనే సరిపోదు. సర్దుబాట్లు కావాలి. సమస్యల్ని అర్థం చేసుకునే ఓర్పు, వాటిని చాకచక్యంగా పరిష్కరించుకోగలిగే నేర్పు ఉండాలి. అప్పుడే కలకాలం సంతోషంగా ఉండొచ్చు.

  • ఉద్యోగాలు, పిల్లల చదువులు, ఇంటి పనులు... చక్కపెట్టుకోవడంతోనే ఏళ్లు గడిచిపోతుంటాయి. ఈ క్రమంలో కొన్నాళ్లు జీవితం యాంత్రికంగానే సాగుతుంది. ఇలాంటప్పుడు అభద్రతతో పాటు, అలకలూ, గొడవలూ ఏర్పడుతుంటాయి. మరి ఈ పరిస్థితిని అధిగమించి సంతోషంగా ఉండాలంటే బాధలకీ, బాధ్యతలకీ దూరంగా కాసేపైనా ఏకాంతంగా గడపడానికి ప్రయత్నించండి. అప్పుడు కేవలం మీకోసం మీరే మాట్లాడుకోండి. ఇది మీ మధ్య ఉన్న అసంతృప్తులను దూరం చేస్తుంది.
  • భార్యాభర్తలు అయినంత మాత్రాన ప్రతీది డిమాండ్‌ చేస్తూ మాట్లాడటం సరికాదు. అలాగని ప్రతిసారీ ఒకే విషయాన్ని ఎత్తి చూపడమూ సరికాదు. ఇద్దరి మధ్యా చోటు చేసుకున్న వాదన ఏదయినా సరే.. అది నిజాయతీగా సాగాలి. స్పష్టత ఉండాలి. అయినప్పటికీ వాదన పెరుగుతోందనుకుంటే దానికి కొంత విరామం ఇవ్వండి. అప్పుడు మీకు ఆలోచనా శక్తి పెరుగుతుంది. ఈ గొడవల్ని ఇతరులతో చర్చించడం కంటే ఏకాంతంగా కూర్చుని ఆలోచించడం వల్లే సులువుగా పరిష్కారమవుతాయి.
  • సమస్య చిన్నదైనా.. భాగస్వామి చెబుతుంటే వినండి. పరిష్కారానికి సాయం చేయండి. పట్టించుకోకపోతే అది అహంగా మారొచ్చు. ఎదుటివారి బాధ మరింత పెరిగే ప్రమాదం ఉంది. అందుకే అవతలివారు చెప్పేది పూర్తిగా వినడం మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్