Lovers: అతనికి వల వేశానంటున్నారు..

మేమిద్దరం ప్రేమించుకున్నాం. వాళ్ల పెద్దలు పెళ్లికి ఒప్పుకోవడం లేదు. ధనవంతులని అతనికి వల వేశానంటున్నారు. చాలా విమర్శిస్తున్నారు. నాకు ఆత్మాభిమానం ఎక్కువ. ట్యూషన్లు చెబుతూ చదువుకుని ప్రముఖ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాను. వాళ్ల తీరు చూస్తే చనిపోవాలనిపిస్తోంది.

Published : 14 Aug 2023 13:42 IST

మేమిద్దరం ప్రేమించుకున్నాం. వాళ్ల పెద్దలు పెళ్లికి ఒప్పుకోవడం లేదు. ధనవంతులని అతనికి వల వేశానంటున్నారు. చాలా విమర్శిస్తున్నారు. నాకు ఆత్మాభిమానం ఎక్కువ. ట్యూషన్లు చెబుతూ చదువుకుని ప్రముఖ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాను. వాళ్ల తీరు చూస్తే చనిపోవాలనిపిస్తోంది.

ఓ సోదరి

మీ గురించే తప్ప అతని చదువు, ఉద్యోగం, మిమ్మల్నెంతగా కావాలనుకుంటున్నదీ రాయలేదు. పెద్దలు వ్యతిరేకించినా నిజమైన ఇష్టం, గౌరవం ఉంటే మిమ్మల్ని సమర్థించి, పెళ్లికి ఒప్పించాలి. మీరీ స్థాయికి వచ్చారంటే తెలివితేటలు, పట్టుదల ఉన్నాయని తెలుస్తోంది. జీవితంలో చాలావరకు స్థిరపడిన మీరు ఈ ఒక్క విషయంలో ఎవరో తప్పుపడుతున్నారని నిరాశచెందడం, ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం సబబు కాదు. ఇది మీ వ్యక్తిత్వాన్ని కించపరిచినట్లవుతుంది. ఆ ఆలోచనే వద్దు. ఇంట్లో వద్దంటున్నా  మీరే కావాలని పట్టుదలతో ఉన్నాడా, మాట నిలబెట్టుకుంటాడా.. వివరంగా తెలుసుకోండి. మీ నిజాయితీ, వ్యక్తిత్వం గురించి వాళ్లకి చెప్పడం, అపోహలు తొలగించి ఒప్పించడం అతని బాధ్యత. మీరేంటో మీరు నిరూపించుకోవాల్సిన పనిలేదు. బాల్‌ అతని కోర్టులో ఉంది. వాళ్లు వ్యతిరేకత చూపినప్పటికీ ఆ అబ్బాయికి నిజంగా ఇష్టం ఉంటే నచ్చజెప్పి, పెళ్లి చేసుకుని.. తర్వాత కూడా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా మీతోనే ఉంటాడనే నమ్మకం కలిగించాలి. అలాకాకుండా,  ఊగిసలాటలో ఉండి పెళ్లయ్యాక చూద్దాంలే.. అని మాట్లాడితే మీరు మనసు మార్చుకోండి. స్థిరంగా ఉండి, వాళ్లు నిందించకుండా, జీవితం సాఫీగా సాగేలా ఆసరాగా ఉంటాడనిపిస్తేనే ముందుకు వెళ్లండి. పెళ్లయ్యాక జీవితాంతం నిందలు, ఆరోపణలతో మనసు గాయపడటం, వాటి వల్ల మీ మధ్య ఘర్షణలు చోటుచేసుకోవడం కంటే ఇవన్నీ ముందు నిశితంగా తెలుసుకోండి. ఒకవేళ నమ్మకం కుదరకపోతే మీ జీవితాన్ని ముగించుకోవాల్సిన అవసరం లేదు. జీవితంలో కొన్ని అవకాశాలు వస్తాయి, పోతాయనుకోండి. ఆత్మవిశ్వాసం కోల్పోకుండా మీ కాళ్లమీద మీరు చక్కగా నిలబడ్డారు కాబట్టి మీ ఉద్యోగం మీద ధ్యాసపెట్టండి. స్థైర్యంగా ఉండండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్