ఘుమఘుమలు కావాలంటే..

చారు.. సూపు వంటివి తయారు చేస్తున్నప్పుడు మిరియాలూ, కరివేపాకు, కొత్తిమీర వేస్తేనే కానీ రుచితోపాటు కమ్మదనం, సువాసన రాదు.

Updated : 09 Dec 2022 13:17 IST

చారు.. సూపు వంటివి తయారు చేస్తున్నప్పుడు మిరియాలూ, కరివేపాకు, కొత్తిమీర వేస్తేనే కానీ రుచితోపాటు కమ్మదనం, సువాసన రాదు. కానీ వాటిని తినేటప్పుడూ...తాగేటప్పుడూ అవి నోటికి అడ్డురావడం కొందరికి నచ్చదు. ఆ సమస్య లేకుండా ఉండాలంటే హెర్బ్‌ ఇన్‌ఫ్యూజర్‌ని కొనుక్కుంటే సరిపోతుంది. దీనిలో వంటకి మనం ఉపయోగించే మసాలా దినుసులని పొడికొట్టి కానీ, విడిగా కానీ వేసి మూత పెట్టేస్తే సరిపోతుంది. తరవాత దాన్ని వంట చేసే సమయంలో పాత్రలో ఉంచేయాలి. ఆ పరికరానికి ఉన్న రంధ్రాల ద్వారా వాటి తాలూకు పరిమళం, రుచీ పదార్థంలోకి దిగుతుంది. కానీ వంటలో ఆ పదార్థాలు పేరుకోవు. వంట అంతా అయిన తర్వాత... దాన్ని బయటకు తీసి శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్