Updated : 09/10/2021 05:08 IST

నానబియ్యం బతుకమ్మ!

ఒక్కేసి పువ్వేసి సందమామా..
ఒక్క జాములాయ సందమామా
శివుడొచ్చే యాల్లాయే సందమామా..
శివుడు రాకపాయ సందమామా..

అంటూ పాటలు పాడుతూ, ఆటలు ఆడుతూ చేసుకునే బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ప్రతి ఊళ్లోనూ ఈ తొమ్మిది రోజులూ సందడి నెలకొని ఉంటుంది. నాలుగో రోజున కూడా బతుకమ్మను భక్తి శ్రద్ధలతో పేరుస్తారు. ఈ రోజున బంగారు బతుకమ్మకు నైవేద్యంగా నానబెట్టిన బియ్యాన్ని పెడతారు. మరికొన్ని ప్రాంతాల్లో బియ్యంతోపాటు పెసరపప్పును కూడా నానబెట్టి ప్రసాదంగా సమర్పిస్తారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని