అన్నపూర్ణాదేవి

నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్థూతాఖిల లోకపావనకరీ ప్రతక్ష మహేశ్వరీ ప్రాలేయాచల వంశపావనకరీ కాశీపురాధీశ్వరీ...

Published : 11 Oct 2021 01:44 IST

నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ
నిర్థూతాఖిల లోకపావనకరీ ప్రతక్ష మహేశ్వరీ
ప్రాలేయాచల వంశపావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి! కృపావలంబనకరీ! మాతాన్నపూర్ణేశ్వరీ

రో రోజు.. అమ్మవారి అవతారాల్లో అన్నపూర్ణాదేవి రూపం విశిష్టమైంది. ఎడమ చేతిలో బంగారు పాత్రతో.. తన భర్త అయిన ఈశ్వరునికి భిక్షను అందించే రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే ఆకలి బాధలు ఉండవని భక్తుల విశ్వాసం. అన్నం పెట్టడం, ఆతిథ్యం ఇవ్వడం, కుటుంబానికి మాత్రమే పరిమితం కాకుండా సమాజానికి కావాల్సిన అంశం. ఉద్యోగాలు చేస్తున్నా... మహిళలు ఈ విషయంలో బాధ్యతగా ఉంటారు. అభాగ్యులను ఆదరించడంలోనూ ఆమె ఓర్పు, నేర్పులే ఆ ఇంటి గౌరవాన్ని పెంపొదిస్తాయి. బాధ్యతగా ఉండే గృహిణులంతా అన్నపూర్ణలే. అమ్మవారూ మహిళలకు ఆ తత్వమే బోధిస్తుంది!


ధనలక్ష్మీ నమోస్తుతే

నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే
శంఖ చక్రగదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే

రోజున అమ్మవారు శ్రీ మహాలక్ష్మీ దేవి అవతారంలో కనువిందు చేస్తారు. జగన్మాత మహాలక్ష్మీ అవతారంలో దుష్ట సంహారం చేసి, లోకాలు కాపాడినట్లు పురాణాలు చెబుతున్నాయి. ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్మి రూపాల్లో అష్టలక్ష్ములుగా అమ్మవారు దర్శనమిస్తారు. సంపదలను అనుగ్రహించే మహాలక్ష్మినే ధనలక్ష్మీ అంటారు. ఆధునిక అవసరాలకు తగినట్టుగా అటు తండ్రికో, భర్తకో ఆర్థిక సహకారాన్ని అందించగలిగిన ప్రతి మహిళా మహాలక్ష్మి స్వరూపమే. సంపాదించకపోయినా పొదుపుగా ఇల్లు దిద్దుకోవడంలో మహిళకు మహిళే సాటి. అలాంటి ఇల్లే లక్ష్మీకళతో శోభిల్లుతుంది. ఈ స్వభావం కూడా మహాలక్ష్మి గుణమే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్