సులువుగా సర్దుదామా!

ఇంటిని ఖరీదైన సోఫాసెట్లూ, అద్భుతమనిపించే పెయింటింగులు, ఆర్భాటమైన షాండ్లియర్‌ లైట్లతో అలంకరించాలంటే అందరికీ సాధ్యం కాదు. అందుకు డబ్బూ, శ్రమా రెండూ కావాలి. ఆ రెండూ లేకుండానే ముచ్చటగొలిపేలా తీర్చిదిద్దుకోవచ్చు, అదేమంత కష్టమైన పని కాదంటున్నారు ఇంటీరియర్‌ డిజైనర్లు...

Updated : 12 Oct 2021 05:23 IST

ఇంటిని ఖరీదైన సోఫాసెట్లూ, అద్భుతమనిపించే పెయింటింగులు, ఆర్భాటమైన షాండ్లియర్‌ లైట్లతో అలంకరించాలంటే అందరికీ సాధ్యం కాదు. అందుకు డబ్బూ, శ్రమా రెండూ కావాలి. ఆ రెండూ లేకుండానే ముచ్చటగొలిపేలా తీర్చిదిద్దుకోవచ్చు, అదేమంత కష్టమైన పని కాదంటున్నారు ఇంటీరియర్‌ డిజైనర్లు...

యా వస్తువులు, వాల్‌ హ్యాంగింగ్‌లు ఎంత ఆహ్లాదంగా ఉంటే అంత ఉల్లాసంగా ఉంటుంది. కొన్ని బొమ్మలు అందాన్ని పెంచకపోగా మూడ్‌ను చెడగొడతాయి. అలాంటివి కొనడం అవసరమా చెప్పండి?!

* మీ పూర్వీకులు వాడిన రాగి, ఇత్తడి వస్తువులేమైనా ఉంటే వాటిని యాంటిక్‌ పీసుల్లా అమర్చండి.

* కిటికీల బయట పూల మొక్కలు నాటితే ఆ ప్రకృతి దృశ్యాలు ఇంటికి అందాన్ని, మనసుకు ప్రశాంతతను ఇస్తాయి.

* టీవీ, రిఫ్రిజిరేటర్ల మీద కవర్లు కానీ కిటికీల కర్టెన్లు గానీ ముదురు రంగులు, పెద్దపెద్ద డిజైన్లు లేకుండా ఎంచుకోండి.

ప్రతిదీ ఆయా నిపుణులను పిలిచి పనులు చేయించాలనుకోవద్దు. చిన్నచిన్న మార్పులు మీరే చేసేయొచ్చు. దాని వల్ల డబ్బు ఆదా అవుతుంది. సంతృప్తిగానూ ఉంటుంది.

* వస్తువులు చిందరవందర కాకుండా ఎక్కడివక్కడ పెడితే దాంతోనే ఇంటికి సగం అందమొస్తుంది.

* ఫర్నిచర్‌కు మ్యాచ్‌ అయ్యేలా గోడలకు రంగులు వేయిస్తే అందం ఇనుమడిస్తుంది. అందుకు తగ్గ లైటింగ్‌ అమర్చుకోవాలి. బల్బులతోనే కాదు, స్విచ్‌ బోర్డులతోనూ గదులకు అందం వస్తుంది. ఎప్పటికప్పుడు కొత్త తరహా స్విచ్‌లు వస్తుంటాయి. మీ అభిరుచిని, అధునాతన భావాలనూ చాటుతాయివి.

* గోడలే కాదు, సీలింగూ ముఖ్యమే. సీలింగును నక్షత్రమండలిలా, మేఘమాలికల్లా మార్చేసే మార్గాలెన్నో ఉన్నాయి. పడుకుని పైకి చూస్తే మబ్బుల్లో తేలిపోతున్న అనుభూతి మీ సొంతమవుతుంది. అదీ సంగతి.. ఆసక్తి, అభిరుచి ఉండాలే కానీ అతి మామూలు ఇంటిని కూడా అపురూపంగా మార్చేసుకోవచ్చు. డబ్బు పెద్దగా వెచ్చించకుండానే ముచ్చటగా సర్దుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్