సద్దుల బతుకమ్మ.. పోయిరావమ్మా!

చిక్కుడు ఆకుల్లా ఉయ్యాలో.. సద్దులు గట్టుకుని ఉయ్యాలో.. సిరిపురం నేనువోతి ఉయ్యాలో.. చుట్టాలా జూడ ఉయ్యాలో..

Updated : 14 Oct 2021 05:00 IST

చిక్కుడు ఆకుల్లా ఉయ్యాలో.. సద్దులు గట్టుకుని ఉయ్యాలో.. సిరిపురం నేనువోతి ఉయ్యాలో.. చుట్టాలా జూడ ఉయ్యాలో..

అంటూ అతివలంతా ఆనందంగా పాడుకుంటోన్న పూల పండగ చివరి రోజు వచ్చేసింది. ఈ రోజు బతుకమ్మని సద్దుల బతుకమ్మగా పిలుస్తారు. అమ్మ వారికి నైవేద్యంగా చింతపండు పులిహోర, నిమ్మకాయ పులి హోర, పెరుగన్నం, నువ్వులన్నం, కొబ్బరన్నం, మలీద ముద్దలు ఇలా రకరకాల సద్దులు చేసి సమర్పిస్తారు. కొన్ని ప్రాంతాల్లో సత్తు పిండి (బియ్యం, పెసరపప్పు, పల్లీలు, నువ్వులు, మినప్పప్పు, మొక్కజొన్న, గోధుమ) రకాలని కూడా అమ్మకు నైవేద్యంగా పెడతారు. ప్రాంతాలను బట్టి ప్రసాదాలూ మారతాయి. చివరి రోజున గౌరమ్మను భక్తిశ్రద్ధలతో పూజించి, బతుకమ్మను నీళ్లలో వదులుతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్