ఇంటి మొక్కలకు కోడిగుడ్డు పెంకులు

జాగ్రత్తగా ఎంచి మరీ మొక్కలు కొంటామా! ఇంటికొచ్చాక కొద్దిరోజులకే చనిపోవడమో, తెగుళ్లో వచ్చేస్తుంటాయి. మనసుకు బాధతోపాటు డబ్బు వృథా అదనం. కొత్తగా మొక్కల పెంపకం మొదల...

Published : 19 Oct 2021 01:57 IST

జాగ్రత్తగా ఎంచి మరీ మొక్కలు కొంటామా! ఇంటికొచ్చాక కొద్దిరోజులకే చనిపోవడమో, తెగుళ్లో వచ్చేస్తుంటాయి. మనసుకు బాధతోపాటు డబ్బు వృథా అదనం. కొత్తగా మొక్కల పెంపకం మొదలు పెట్టిన వాళ్లకు ఎదురయ్యే అనుభవాలే ఇవి! మరేం చేయాలంటారా?

కుండీల్లో నీరు ఎక్కువైతే ఫంగస్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ. ముఖ్యంగా వర్ష సమయంలో ఈ పరిస్థితి ఎదురవుతుంది. నీటి నిల్వలుంటే ఎప్పటికప్పుడు తీసేయాలి. ఫంగస్‌ కనిపించిన భాగాలను కత్తిరించి, మట్టి మరీ తడిగా లేనపుడు మొదళ్లలో కాస్త దాల్చిన చెక్క పొడిని వేసి చూడండి. ఫలితం ఉంటుంది. విత్తనాలను నాటేటపుడూ ఈ సమస్య కనిపిస్తుంది. వాటికీ ఇదే మంచి పరిష్కారం.

కీటకాలు, పురుగులు ఎక్కువగా కనిపిస్తుంటే మొక్క మొదళ్లలో కాఫీ పొడి చల్లితే సరి. ఇది పెరుగుదలను ప్రోత్సహించడంతోపాటు ఇతర సమస్యలనూ నివారిస్తుంది. కోడిగుడ్డు పెంకులను వేస్తే నత్తలు, గొంగళి పురుగు వగైరా మొక్కలను తినే పురుగులు దరి చేరవు.

మొక్కలను కుండీల్లోకి మార్చేటప్పుడు కొంత హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ను వేయండి. ఇది వేర్లను ఇన్ఫెక్షన్ల బారి నుంచి రక్షిస్తుంది. కొమ్మలను నాటేటప్పుడు కొంచెం తేనెలో ముంచితే వేర్లు ఏర్పడటానికే కాదు.. రోగాల బారి నుంచీ రక్షిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్