ఇంట్లోనూ బ్లాక్‌ బోర్డు..

హరిత వంటింట్లో నిండుకున్న సామాన్లను వెంటనే తెప్పించాలను కుంటుంది. హడావుడిలో మర్చిపోయి, మరుసటి రోజు వంటలో అవి లేక ఇబ్బంది పడుతుంటుంది. అందుకే.. ప్రతి గదిలోనూ ఓ బ్లాక్‌ బోర్డుండాలి.

Updated : 13 May 2022 15:54 IST

హరిత వంటింట్లో నిండుకున్న సామాన్లను వెంటనే తెప్పించాలనుకుంటుంది. హడావుడిలో మర్చిపోయి, మరుసటి రోజు వంటలో అవి లేక ఇబ్బంది పడుతుంటుంది. అందుకే.. ప్రతి గదిలోనూ ఓ బ్లాక్‌ బోర్డుండాలి.

* వంటగదిలో.. నెలకోసారి సరుకులు తెచ్చుకున్నా.. ఒక్కోసారి అనుకోని అతిథులు, పండుగల వంటి సందర్భాల్లో త్వరగా అయిపోతాయి. కొన్ని సార్లు మర్చిపోయి ఉన్నవే మళ్లీ కొంటాం. ఇలాంటి పొరపాట్లు జరక్కుండా ఉండాలంటే అయిపోయిన, మిగిలిన సామాన్ల వివరాలను రాసుకోవడానికి వంటింట్లో చిన్న బ్లాక్‌బోర్డు ఉంటే మంచిది. ఎప్పటికప్పుడు సరుకుల పేర్లను అందులో రాసుకుంటే, గుర్తుంటుంది. నిల్వ ఉన్నవాటినీ బోర్డుపై బ్యాలెన్స్‌ లిస్ట్‌లో పొందుపరిస్తే ఆ తర్వాతి నెలలో వాటిని కొనకుండా జాగ్రత్తపడొచ్చు. ఈ పద్ధతితో నగదు, సామాన్ల వృథాను అరికట్టొచ్చు. దీన్ని పాటించడం అలవరుచుకుంటే బడ్జెట్‌ను నియంత్రించొచ్చు.

* పిల్లల గదిలో... చిన్నారులకు తరచూ ఏదో ఒకటి అవసరమవుతూనే ఉంటుంది. చదువుకు సంబంధించినదో, లేదా మరొకటో అవ్వొచ్చు. పిల్లల గదిలో చిన్న బోర్డు ఉంటే ఇటువంటప్పుడు ఉపయోగపడుతుంది. పుస్తకాలు, పెన్సిళ్లు లేదా వారికి కావాల్సిన వాటి వివరాలను ఆ బోర్డుపై వారినే రాయమనాలి. ఈ అలవాటుతో వారిక్కావలసినవి వారు మర్చిపోకుండా ఉంటారు. పెద్దవాళ్లకూ అవగాహన ఉంటుంది. కొందరు చిన్నారులకు డ్రాయింగ్‌ పుస్తకాలెన్ని ఉన్నా, గోడమీద బొమ్మలు వేసే అలవాటుంటుంది. అటు వంటి వారికి ఈ బోర్డు బాగా ఉపయోగం. వారి ఆలోచనలను ఆ బోర్డుపై గీయమని చెప్పాలి.

* రీడింగ్‌ రూంలో... ఆఫీస్‌ వర్క్‌, పుస్తక పఠనం కోసం వినియోగించే రీడింగ్‌ రూంలో చిన్న బ్లాక్‌ బోర్డు ఉండాలి. చదవాల్సిన పుస్తకాలు గుర్తొచ్చినప్పుడు వాటిని ఆ బోర్డుపై రాస్తూ ఉండాలి. ఆఫీస్‌లో చేయాల్సిన పనులను కాగితాలపై కాకుండా దానిపై రాస్తుంటే, చూసినప్పుడల్లా గుర్తొస్తుంది. ప్రాజెక్టుకు సంబంధించి కొత్త ఆలోచనలనూ దీనిపై చక్కగా రాసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్