నిమిషాల్లో ఆరబెడుతుంది!
ఈ కాలంలో చలిగాలులు వీస్తూనే ఉంటాయి. తేమతో వాతావరణం అంతా తడిపొడిగానే ఉంటుంది. ఉతికిన దుస్తులు ఓ పట్టాన ఆరవు. అలాంటి ఈ సమస్యకి చెక్ పెట్టడానికి ఉపకరించేదే ఈ ఫొటోలో కనిపిస్తున్న యంత్రం. దీని పేరు మోరస్ జీరో.
ఈ కాలంలో చలిగాలులు వీస్తూనే ఉంటాయి. తేమతో వాతావరణం అంతా తడిపొడిగానే ఉంటుంది. ఉతికిన దుస్తులు ఓ పట్టాన ఆరవు. అలాంటి ఈ సమస్యకి చెక్ పెట్టడానికి ఉపకరించేదే ఈ ఫొటోలో కనిపిస్తున్న యంత్రం. దీని పేరు మోరస్ జీరో. ఇది అల్ట్రా ఫాస్ట్ కౌంటర్ టాప్ టంబెల్ డ్రయ్యర్. ఈ డ్రయ్యర్‌లో తడి దుస్తులను వేస్తే చాలు పదిహేను నిమిషాల్లో ఆరబెట్టేస్తుంది. దీన్ని ఉపయోగించడమూ సులువే. దీనిలో విడుదలయ్యే యూవీ కిరణాలు దుస్తుల్లోని తేమతోపాటు హానికారక బ్యాక్టీరియానూ అంతమొందిస్తాయి. పర్యావరణహితమైంది, ఎలాంటి రసాయనాలూ అవసరం లేదు. వస్త్రాల నాణ్యత దెబ్బ తినకుండానూ ఉండేలా దీన్ని రూపొందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.