ఒద్దికగా.. చక్కగా.. సర్దేదామా!

లత ఆఫీసుకు రెడీ అయ్యే తొందరలో ఉంది. డ్రెస్‌ కోసం అల్మారా తెరిస్తే దుస్తులన్నీ ఒకదాని వెంట మరొకటి పడిపోయాయి. వాటిని చూస్తూనే ఆమెకు కళ్లు తిరిగినంత పనైంది. వీటిని ఎలా సర్దాలి అని తల పట్టుకుంది.

Published : 05 Dec 2021 01:39 IST

లత ఆఫీసుకు రెడీ అయ్యే తొందరలో ఉంది. డ్రెస్‌ కోసం అల్మారా తెరిస్తే దుస్తులన్నీ ఒకదాని వెంట మరొకటి పడిపోయాయి. వాటిని చూస్తూనే ఆమెకు కళ్లు తిరిగినంత పనైంది. వీటిని ఎలా సర్దాలి అని తల పట్టుకుంది. రోజువారీ పనులతో సతమతమయ్యే మనలో చాలామందికి ఇది అనుభవమే! మరేంటి పరిష్కారం? ఇదిగో!!

అల్మారా/వార్డ్‌ రోబ్‌ మొత్తం ఒకేరోజు కాకుండా రోజుకో అర చొప్పున సర్దడం మొదలుపెట్టాలి. అప్పుడు విసుగు, ఎక్కువ సమయం పడుతుందనే టెన్షనూ ఉండదు. అయితే దాన్నీ పైపైన కాకుండా శుభ్రంగా, చక్కగా సర్దుకోవాలి.

అరలన్నింటినీ దుస్తులకే కాకుండా కొన్నింటిని నగలు, వెండి సామాగ్రి లాంటి విలువైన వస్తువుల కోసం కేటాయించాలి. పర్సు, హ్యాండ్‌ బ్యాగులకూ స్థలం కేటాయించుకోవాలి. తర్వాత అవసరమై తీసినా తిరిగి యథాస్థానానికి చేర్చాలి. అప్పుడు వెతుక్కోవాల్సిన అవసరముండదు.

చెవి దిద్దులు, గాజులు, బ్రాస్‌లెట్‌, మేకప్‌ కిట్‌.. ఇలా రోజువారీ ఉపయోగించే వాటన్నింటినీ అద్దానికి దగ్గరగా ప్రత్యేకమైన అరల్లో సర్దుకుంటే సులువుగా తీసుకోవచ్చు. రోజువారీ అవసరమయ్యే వాటిని సులువుగా కనిపించేలా పెట్టుకోవాలి. తక్కువ ఉపయోగముండేవాటిని లోపలికి పెట్టుకుంటే సరి. అయితే మూడు నెలల కంటే ఎక్కువ రోజులు వాడని దుస్తులు/వస్తువులను కింద అరలో పడేస్తే పని సులువవుతుంది. మనసూ ప్రశాంతంగా ఉంటుంది.

చివరగా మీరు వాడని వస్తువులు/దుస్తులను ఎప్పటికప్పుడు దగ్గరలోని అనాథ అశ్రమంలోని వారికి ఇచ్చేయండి. వారు సంతోషిస్తారు. మీకూ మానసిక తృప్తి లభిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్