మగవాళ్లూ వంట చేస్తారా?

అక్షరాస్యతలో ముందుండే కేరళ ఇప్పుడు లింగవివక్షని జయించే విషయంలోనూ ఓ వినూత్నమైన ఆలోచన చేసింది. అబ్బాయిలకు కూడా ఇంటిపని... వంటపని వస్తే మంచిదని ఆ దిశగా వాళ్లలో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఆ రాష్ట్ర మహిళా శిశుసంక్షేమశాఖ

Updated : 19 Dec 2021 05:07 IST

లోన్‌ ఇస్తాం

అక్షరాస్యతలో ముందుండే కేరళ ఇప్పుడు లింగవివక్షని జయించే విషయంలోనూ ఓ వినూత్నమైన ఆలోచన చేసింది. అబ్బాయిలకు కూడా ఇంటిపని... వంటపని వస్తే మంచిదని ఆ దిశగా వాళ్లలో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఆ రాష్ట్ర మహిళా శిశుసంక్షేమశాఖ... ‘ది స్మార్ట్‌ కిచెన్‌’ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టి మగపిల్లలకీ, పెద్దవాళ్లకి కూడా వంటలో శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టింది. బాగా చేసిన వారికి అవార్డులు కూడా ఇస్తుందట. ఆసక్తి ఉన్న మగవాళ్లకి వంటింటి సామగ్రి కొనుక్కొనేందుకు లోన్‌లు కూడా అందివ్వడం విశేషం. ‘కొవిడ్‌  తర్వాత కాలంలో ఆడవాళ్లపై ఇంటిభారం ఎక్కువవుతోంది. దీని నుంచి వాళ్లకు కొంతైనా ఉపశమనం కలిగించేందుకే ఈ ప్రయత్నం’ అంటున్నారు అక్కడి అధికారులు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్