పొదుపు చేద్దామిలా...

నెలవారి సరకులు, పిల్లల ఫీజులు, ఇంటి, వాహన వాయిదాలు (ఈఎంఐలు.).. ఇన్ని ఖర్చుల్లో పొదుపు చేయడం అంటే ఇంటి ఇల్లాలికి కత్తి మీదే సామే... అయినా కొన్ని చిట్కాలు పాటించి పొదుపు చేయొచ్చంటున్నారు నిపుణులు..

Published : 19 Jan 2022 01:07 IST

నెలవారి సరకులు, పిల్లల ఫీజులు, ఇంటి, వాహన వాయిదాలు (ఈఎంఐలు.).. ఇన్ని ఖర్చుల్లో పొదుపు చేయడం అంటే ఇంటి ఇల్లాలికి కత్తి మీదే సామే... అయినా కొన్ని చిట్కాలు పాటించి పొదుపు చేయొచ్చంటున్నారు నిపుణులు..

* నెలా నెలా... కిరాణా సరకుల కోసం జాబితాను తయారుచేసుకున్న తర్వాతే సూపర్‌ మార్కెట్‌కో, పచారీ కొట్టుకో వెళ్లాలి. లేదంటే కంటికి కనిపించినవన్నీ కొనేస్తారు.  అలాగే జాబితా తయారుచేసే ముందు వంటింట్లో ఓసారి ఏమేం వస్తువులు మిగిలి ఉన్నాయో కూడా చూసుకుంటే కొంత నగదు మిగిలినట్లే కదా.

* ఉద్యోగినులైతే పండగలు, ప్రత్యేక రోజులకు వచ్చిన అదనపు వేతనాన్ని ఖర్చు పెట్టకుండా కొత్త వస్తువు కొనడానికో, పిల్లల పేరు మీద పోస్టాఫీసులో వేస్తే మంచిది.  

* ప్రతి వారం కూరగాయలు, పండ్లను సూపర్‌ మార్కెట్‌, మాల్స్‌ నుంచి కాకుండా సంత నుంచి తెచ్చుకుంటే ధర తక్కువగా ఉండటమే కాకుండా తాజావి లభిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్