శుభ్రత సులువే!

వారానికోసారైనా ఇల్లు మొత్తం శుభ్రం చేస్తుంటాం. ప్రతిభాగాన్ని ఒక్కోదాన్ని ఒక్కోలా శుభ్రం చేయాలి. కొన్నింటిని దులపాలి, మరికొన్నింటిని నీటితో రుద్ది కడగాలి. అంతా పూర్తయ్యేసరికి భుజాలు, నడుము నొప్పి వచ్చేస్తాయి

Updated : 29 Jan 2022 04:58 IST

వారానికోసారైనా ఇల్లు మొత్తం శుభ్రం చేస్తుంటాం. ప్రతిభాగాన్ని ఒక్కోదాన్ని ఒక్కోలా శుభ్రం చేయాలి. కొన్నింటిని దులపాలి, మరికొన్నింటిని నీటితో రుద్ది కడగాలి. అంతా పూర్తయ్యేసరికి భుజాలు, నడుము నొప్పి వచ్చేస్తాయి. ఈ ‘స్పిన్నింగ్‌ స్క్రబ్బర్‌’ని తెచ్చేసుకోండి. మీట నొక్కగానే గుండ్రంగా తిరుగుతూ ఉంచిన చోట చిటికెలో దుమ్ము, మురికి వదలగొడుతుంది. వివిధ స్క్రబ్బర్‌లను ఇస్తారు. పైకప్పు నుంచి కిటికీలు, బాత్రూమ్‌, కప్‌బోర్డ్‌, సింకు, మూలలు.. ఇలా ఒక్కోదానికి తగ్గట్టుగా అవసరమైనది మార్చుకుంటే సరిపోతుంది. ఎత్తునూ నచ్చిన విధంగా ఏర్పాటు చేసుకునే వీలు ఉంది. బ్యాటరీతో నడుస్తుంది. ఓసారి పూర్తిగా ఛార్జింగ్‌ పెట్టుకుంటే గంటన్నరకుపైగా ఏకధాటిగా నడుస్తుంది. పైగా వాటర్‌ ప్రూఫ్‌. నచ్చిందా మరి. అయితే ఈకామర్స్‌ వేదికల్లో దొరుకుతోంది. వెతికేయండి మరి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్