స్వచ్ఛమైన చల్లదనం...

స్వచ్ఛమైన గాలి కరువైందంటూ తిట్టుకునే బదులు మన వంతు ఏం చేయగలమాని ఆలోచించే మహిళలు ఇంట్లో సాధ్యమైనన్ని మొక్కలు నాటుతున్నారు. వాకిట్లో స్థలం లేకపోయినా నిరాశ చెందక వసారాల్లో వరండాల్లో మొక్కలు పెంచుతున్నారు. రోజులో తాము చేసుకునే అనేక పనుల్లో మొక్కల పెంపకమూ ఒకటి. అయితే ప్రారంభించే ముందు కొన్ని సూత్రాలను గమనించుకోవాలి.

Published : 17 Mar 2022 00:42 IST

స్వచ్ఛమైన గాలి కరువైందంటూ తిట్టుకునే బదులు మన వంతు ఏం చేయగలమాని ఆలోచించే మహిళలు ఇంట్లో సాధ్యమైనన్ని మొక్కలు నాటుతున్నారు. వాకిట్లో స్థలం లేకపోయినా నిరాశ చెందక వసారాల్లో వరండాల్లో మొక్కలు పెంచుతున్నారు. రోజులో తాము చేసుకునే అనేక పనుల్లో మొక్కల పెంపకమూ ఒకటి. అయితే ప్రారంభించే ముందు కొన్ని సూత్రాలను గమనించుకోవాలి.

స్థలం మెండుగా ఉంటే మంచిదే.. పండ్ల మొక్కలతో సహా ఎన్నెన్నో రకాలు పెంచుకోవచ్చు. కానీ కొద్ది జాగానే ఉందని నిరాశ చెందకుండా అందులోనే వీలైనన్ని మొక్కలు నాటి ఫలసాయం పొందొచ్చు.

మెట్లుగా ఉన్న స్టాండు మీద మొక్కల కుండీలు పెట్టడం వల్ల తక్కువ స్థలంలోనూ ఎక్కువ మొక్కల్ని పెంచవచ్చు. వంగ, బెండ, గోంగూర, మెంతికూర లాంటివి కుండీల్లో కూడా చక్కగా పెరుగుతాయి. దోస, కాకర తదితర తీగ జాతులను గోడలు లేదా గ్రిల్‌ డోర్స్‌ మీదుగా మేడ మీదికి పాకించవచ్చు.

కాస్త పెద్ద కుండీలూ లేదా టబ్బుల్లో బంగాళా దుంప, చిలగడ దుంప, పసుపు, ఉల్లి మొదలైనవి పెంచవచ్చు.

చెక్క లేదా ప్లాస్టిక్‌ కుర్చీలు బయట వేస్తే ఎండకు పాడైపోతాయి. అందుకు బదులుగా మొక్కల పక్కన ఒక అరుగు కట్టిస్తే సాయంత్రాలు ఎంచక్కా సేదతీరొచ్చు. ఆ అరుగు కింది భాగంలో అర ఏర్పాటు చేస్తే తోటలో వినియోగించే గునపం, పార, నీళ్ల పైపు లాంటి వస్తువులన్నీ పెట్టేయొచ్చు.

మొక్కల పెంపకంతో ప్రకృతి శోభ మనింట్లోనే ఉంటుంది. ఎరువుల్లేని కూరగాయలు సొంతమవుతాయి. ఆరోగ్యం, డబ్బు ఆదా, అంతకు మించి మనమే పండించామన్న తృప్తి. తలుపులూ కిటికీలూ తెరిచిపెడితే ఏసీలూ ఫ్యాన్లూ ఇవ్వలేని స్వచ్ఛమైన చల్లదనాన్నీ ఇస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్