ఇంట్లోనే ఎండు ద్రాక్ష...

కిస్మిస్‌ వేస్తే కొన్ని స్వీట్లకి అదనపు రుచి వస్తుంది. కానీ మార్కెట్‌లో అన్నిసార్లూ నాణ్యమైనవి దొరక్కపోవచ్చు. దొరికినా ధర ఎక్కువ. అందుకే ద్రాక్ష పళ్లు తెచ్చుకుని ఇంట్లోనే కిస్మిస్‌ తయారు

Published : 16 Apr 2022 00:23 IST

కిస్మిస్‌ వేస్తే కొన్ని స్వీట్లకి అదనపు రుచి వస్తుంది. కానీ మార్కెట్‌లో అన్నిసార్లూ నాణ్యమైనవి దొరక్కపోవచ్చు. దొరికినా ధర ఎక్కువ. అందుకే ద్రాక్ష పళ్లు తెచ్చుకుని ఇంట్లోనే కిస్మిస్‌ తయారు చేసేయండి. ఎలా అంటారా..?

ఒక బేకింగ్‌ షీట్‌ తీసుకుని దానిమీద ముందు నాన్‌స్టిక్‌ కుకింగ్‌ స్ప్రే కొట్టండి. పాన్‌మీద సరిపడినన్ని విత్తనాల్లేని ద్రాక్ష పళ్లని వేసి అన్నివైపులా సమానంగా సర్దండి. వాటిని అవెన్‌లో పెట్టి 107 డిగ్రీల సెల్సియస్‌ వద్ద వేడిచేయండి. వాటిలో తేమ తగ్గే వరకూ దాదాపు గంటపాటు(ఈ సమయం ద్రాక్ష, అవెన్‌లబట్టి అటూ ఇటూగా మారుతుంది) ఇలా చేయండి. తర్వాత అవెన్‌ ఆఫ్‌ చేసి కిస్మిస్‌లు చల్లబడే వరకూ అందులోనే ఉంచండి. తర్వాత గరిటె సాయంతో వాటిలో అంటుకున్న వాటిని వేరుచేసి పాత్రలోకి తీసుకుంటే సరిపోతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్