వస్తువులు తగ్గించేద్దాం..

వంట చేయడం, వడ్డించడం, పిల్లలూ పెద్దలకు అన్నీ సమకూర్చడం లాంటివి తక్షణం జరిగిపోతుంటాయి. కానీ ఇల్లు సర్దడం లాంటి పనులు వాయిదా వేస్తుంటాం. అప్పుడిక ఇల్లంతా గజిబిజిగా, గందరగోళంగా తయారవుతుంది.

Published : 18 Apr 2022 00:48 IST

వంట చేయడం, వడ్డించడం, పిల్లలూ పెద్దలకు అన్నీ సమకూర్చడం లాంటివి తక్షణం జరిగిపోతుంటాయి. కానీ ఇల్లు సర్దడం లాంటి పనులు వాయిదా వేస్తుంటాం. అప్పుడిక ఇల్లంతా గజిబిజిగా, గందరగోళంగా తయారవుతుంది. అది చూడటానికి బాగోకపోవడమే కాదు, ఆహ్లాద వాతావరణాన్ని పోగొట్టి విసుగూ, అసహనాలకు దారితీస్తుంది. అందుకు కొన్ని పరిష్కారాలు చూద్దాం...

* వస్తువులు పెరిగే కొద్దీ ఇల్లు సర్దడం మరీ కష్టమవుతుంది. ఒక వస్తువు కోసం వెళ్లి కంటికి నచ్చిన  మరెన్నో కొనుగోలు చేయడం మనలో చాలామందికి అలవాటు. అమ్ముకునేవాళ్లు అందంగా, ఆకర్షణీయంగా అమరుస్తారు నిజమే. సూపర్‌ మార్కెట్లు లేదా ఫర్నిచర్‌ దుకాణాల ఉద్దేశమే అది. కానీ అవన్నీ కొని తెచ్చి ఇంట్లో పెట్టేయాలన్న ఆరాటం ఎందుకు చెప్పండి.. డబ్బు వృథా, ఇంట్లో చోటు దండగ. అన్నిటినీ మించి సర్దలేక అవస్థ.
* వర్షాకాలం ఇంట్లో దుస్తులు ఆరబెట్టేందుకు సాధారణంగా లోహపు స్టాండును ఉపయోగిస్తాం. కానీ అది నడిచేటప్పుడు అడ్డుగా ఉంటుంది. ఈ సమస్యకు నివారణగా వేళ్లాడదీసే పరికరాన్ని కిటికీకి అమర్చుకుంటే అడ్డుగా ఉండదు. అవసరం లేనప్పుడు కిటికీలో ఇమిడిపోతుంది. అలాగే ల్యాప్‌టాప్‌ కోసం రాతబల్ల (రైటింగ్‌ టేబుల్‌) కొనే బదులు గదిలో కిటికీ పక్కన చెక్క అల్మర ఏర్పాటు చేసుకుంటే సరి. పని చేసేటప్పుడు ముందుకు పరచుకుని, లేనప్పుడు మూసేయొచ్చు.
* వంటింట్లో పొయ్యి గట్టు కింద చిన్న చిన్న సొరుగులు అనేకం రూపొందించుకుంటే వస్తువులన్నిటినీ వాటిల్లో సర్దేయొచ్చు. అవసరానికి వెతుకులాట లేకుండా తేలిగ్గా దొరుకుతాయి.
* తడి తువ్వాళ్లను బట్టల స్టాండు, తలుపుల మీదో ఆరేస్తుంటారు కొందరు. అది చూడటానికి బాగోదు. అందుకు బదులుగా గది తలుపు లోపలి వైపు కొక్కెం ఏర్పాటు చేసుకుంటే అక్కడ తగిలించవచ్చు. అది ఎదురుగా కనిపించదు, తడి ఆరిపోయి ముంజు వాసన కూడా రాదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్