బొద్దింకల పని పట్టేయండి!

ఎంత జాగ్రత్తగా శుభ్రం చేసినా ఎక్కడ నక్కుతాయో కానీ.. బొద్దింకల బెడద తప్పించలేం. వంట గది, పడక గది.. ఎక్కడ చూసినా అవే కనిపిస్తుంటాయి. ఈ చిట్కాలు ప్రయత్నించి చూడండి.. తరిమేయొచ్చు.

Published : 19 Apr 2022 01:40 IST

ఎంత జాగ్రత్తగా శుభ్రం చేసినా ఎక్కడ నక్కుతాయో కానీ.. బొద్దింకల బెడద తప్పించలేం. వంట గది, పడక గది.. ఎక్కడ చూసినా అవే కనిపిస్తుంటాయి. ఈ చిట్కాలు ప్రయత్నించి చూడండి.. తరిమేయొచ్చు.

* ఒకటి మన కంట పడిందంటే.. దానికి వందల రెట్లు దాగున్నాయని అర్థం. ఇవి బ్యాక్టీరియాలను వ్యాప్తి చేస్తాయి. దీంతో అనారోగ్యం. ఇవెక్కువగా తరచుగా వాడని, తేమ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో తిష్ట వేస్తుంటాయి. కాబట్టి, కప్‌బోర్డులను నెలకోసారైనా శుభ్రం చేస్తుండండి. సింకుల కిందా శుభ్రత తప్పనిసరి.

* ఎక్కువగా కనిపిస్తున్న ప్రదేశాల్లో హెయిర్‌ స్ప్రేను కొట్టండి. త్వరగా చనిపోవడమే కాదు.. ఆ ఛాయల్లోకీ చాలా కాలంపాటు రావు.

* బిర్యానీ ఆకులను పొడిచేయండి. పొయ్యి గట్టు కింద, అల్మరాలు, రోజువారీ శుభ్రం చేయని ప్రదేశాల్లో దాన్ని చల్లండి. ఈ వాసనకు బొద్దింకలు వెళ్లిపోతాయి.

* అమోనియా కూడా ఇలాంటి మ్యాజిక్కే చేస్తుంది. అయితే వాసనతో కాస్త ఇబ్బంది. రెండు కప్పుల అమ్మోనియాను బకెట్‌ నీటిలో కలిపి గచ్చుని తుడవండి. వాసనకి అవి పారిపోతాయి. ఆ స్ప్రే బాటిల్‌లో పోసుకుంటే వంటగది గట్టు, మూలల్లో శుభ్రం చేస్తే దాగుండే అవకాశమే ఉండదు.

* బొద్దింకలు రాత్రి సమయాల్లోనే స్వేచ్ఛగా తిరిగేస్తుంటాయి. మార్కెట్‌లో స్టికీ టేప్‌ ట్రాప్స్‌ దొరుకుతాయి. వీటిని నిద్రపోయే ముందు అవి ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో ఉంచేయండి. దాని వాసనకు ఆకర్షితమై వచ్చి అతుక్కుంటాయి. ఇలా కొన్నిరోజులపాటు వరుసగా చేస్తే సరి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్