స్నానాల గదిని మెరిపించేయండి!

వారం వారం శుభ్రం చేసినా.. స్నానాల గది మురికితో, నీటి మరకలతో నిండి పోతుంది. రుద్ది రుద్ది చేతులు పడి పోతుంటాయి. ఈసారి ఈ చిట్కాలను పాటించండి.. శ్రమ తగ్గుతుంది.

Published : 20 Apr 2022 01:40 IST

వారం వారం శుభ్రం చేసినా.. స్నానాల గది మురికితో, నీటి మరకలతో నిండి పోతుంది. రుద్ది రుద్ది చేతులు పడి పోతుంటాయి. ఈసారి ఈ చిట్కాలను పాటించండి.. శ్రమ తగ్గుతుంది.
* టైల్స్‌పై నీరు, నురగ మచ్చలా? కప్పు నీటికి అరకప్పు లిక్విడ్‌ డిష్‌వాష్‌ కలిపి, దానికి కొద్దిగా వేడి చేసిన వెనిగర్‌ను కలపాలి. ఓ స్ప్రే బాటిల్‌లోకి తీసుకొని టైల్స్‌పై పిచికారీ చేసి, అయిదు నిమిషాలయ్యాక బ్రష్‌తో రుద్ది కడిగేస్తే సరి.

* షేవింగ్‌ క్రీమ్‌కు గాఢమైన బ్లీచింగ్‌ పౌడర్‌ చేర్చి టాయ్‌లెట్‌కు రుద్ది కొద్ది సేపు వదిలేయండి. మరకలు పోయి మెరవడమే కాదు.. సూక్ష్మజీవులూ చనిపోతాయి.

* సింకు చుట్టుపక్కల్లో నీరు, మురికి చేరి మొండి మరకల్లా తయారవుతుంటాయి. ఎంత ప్రయత్నించినా కొన్నిసార్లు వదలవు. అరకప్పు చొప్పున నీరు, వెనిగర్‌ తీసుకొని కొద్దిగా వేడి చేయండి. ఈ మిశ్రమాన్ని మరకలున్న చోట రాయండి. పూర్తిగా ఆరాక నిమ్మ నూనెను చల్లి బ్రష్‌ లేదా కాగితపు ఉండతో రుద్ది కడిగేస్తే సరి.

* ట్యాప్‌లను డిష్‌వాష్‌ లిక్విడ్‌తో రుద్ది కడగండి. తర్వాత పొడి వస్త్రంపై పెట్రోల్‌ జెల్లీ రాసి దాంతో తుడిస్తే.. మెరుస్తాయి.

* అద్దాలను పొడి వస్త్రంపై కొద్దిగా షేవింగ్‌ క్రీమ్‌ తీసుకొని వృత్తాకారంలో రుద్దుతూ వెళ్లండి. మరకలు తొలగి కొత్తదానిలా కనిపిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్