పంజరంలో పచ్చదనం..

చుట్టూ నాలుగు మొక్కలు కనిపిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి చిత్తవుతుంది. మామూలు పూలతొట్టెలకు బదులు ఇంటిని పచ్చదనంతో మెరిపించడానికి ఈ పంజరాలని ప్రయత్నించండి. హాయిగానే కాదు కొత్తగానూ ఉంటుంది.. 

Published : 22 May 2022 01:27 IST

చుట్టూ నాలుగు మొక్కలు కనిపిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి చిత్తవుతుంది. మామూలు పూలతొట్టెలకు బదులు ఇంటిని పచ్చదనంతో మెరిపించడానికి ఈ పంజరాలని ప్రయత్నించండి. హాయిగానే కాదు కొత్తగానూ ఉంటుంది.. 

ముందుగా పంజరానికి తెలుపు లేదా నీలివర్ణం రంగు వేసి ఆరనివ్వాలి. ఇందులో పెంచడానికి ఇండోర్‌ మొక్కలను ఎంపిక చేసుకోవాలి. ఫెర్న్, మనీప్లాంట్, టేబుల్‌ రోజ్, కలబంద వంటివి తీసుకోవాలి. పంజరానికి అడుగున ప్లాస్టిక్‌ కవరువేసి అందులో సేంద్రియ మట్టిని రెండంగుళాల మందాన సర్దాలి. ఇందులో ఎంపిక చేసుకున్న మొక్కలను నాటాలి. తీగలా పాకే మొక్కలైతే చిగుళ్లను తీసి పంజరం ఊచలకు చుట్టేయాలి. రెండుమూడు రోజులకొకసారి నీటిని చిలకరిస్తే సరిపోతుంది. నాలుగైదు వారాలకు మొక్క ఎదిగిన తర్వాత పంజరానికి పైన తాడు కట్టి హాలు మధ్యలో లేదా డైనింగ్‌ టేబుల్‌పైన వేలాడేసినా అందంగా కనిపిస్తుంది. ఇంట్లో పచ్చదనాన్ని నింపుతుంది. 

ఇంకా... చిన్న తొట్టెలో ముందుగా ఇండోర్‌ లేదా టేబుల్‌రోజ్‌ మొక్కను నాటి కాస్తంత పెరగనివ్వాలి. దీన్ని పంజరంలో ఉంచాలి. ఆ తర్వాత తొట్టె కనబడకుండా అదే మొక్క ఆకులతో కప్పేయాలి. పంజరంలోనే పెరుగుతున్నట్లు చూడటానికి అందంగా ఉంటుంది. నిండుగా పూలు విరిసిన ఈ పంజరాన్ని బాల్కనీ లేదా వరండాలో వేలాడదీస్తే చాలు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్