తలనొప్పి వేధిస్తోంటే..

తలనొప్పి.. ఈ మధ్య ఇళ్లలో ఉండే ఆడవాళ్ల నుంచి తరచూ వినిపిస్తున్న మాట. ఆఫీసు పని, పెరిగిన బాధ్యతలు, ఇంటికే పరిమితమవడం, ఒత్తిడి... వెరసి దీనికి దారి తీస్తున్నాయంటున్నారు నిపుణులు. నివారణకు కొన్ని చిట్కాలూ సూచిస్తున్నారు.

Published : 04 Jul 2021 01:48 IST


తలనొప్పి.. ఈ మధ్య ఇళ్లలో ఉండే ఆడవాళ్ల నుంచి తరచూ వినిపిస్తున్న మాట. ఆఫీసు పని, పెరిగిన బాధ్యతలు, ఇంటికే పరిమితమవడం, ఒత్తిడి... వెరసి దీనికి దారి తీస్తున్నాయంటున్నారు నిపుణులు. నివారణకు కొన్ని చిట్కాలూ సూచిస్తున్నారు. మైగ్రేన్‌ ఉన్నవారూ వీటిని పాటించొచ్చు.

*  దీర్ఘశ్వాస: ఒత్తిడి, ఆందోళన శ్వాసపైనా తద్వారా మానసిక స్థితిపైనా ప్రభావం చూపుతాయి. కాబట్టి శరీరానికి తగిన ఆక్సిజన్‌ అందేలా చూసుకోవాలి. ఇది కార్టిసాల్‌, స్ట్రెస్‌ హార్మోన్‌ స్థాయులను తగ్గేలా చేయడంతో పాటు శరీరాన్ని రిలాక్సేషన్‌ మోడ్‌లోకి తీసుకెళ్తుంది. అందుకే అప్పుడప్పుడూ దీర్ఘశ్వాసను తీసుకుని  వదులుతుండాలి.

*  నిద్ర: ఒత్తిడి పెరిగే కొద్దీ దీర్ఘనిద్ర శాతం తగ్గుతుంటుంది. ఇది మెదడు, శరీరం రెండింటిపైనా ప్రభావం చూపుతుంది. అరకొర, అసంపూర్తి నిద్ర తలనొప్పికి కారణమవుతాయి. ఒకే సమయంలో పడుకోవాలి. నిద్రకు గంట ముందు గ్యాడ్జెట్లను పక్కన పెట్టాలి.

*  వ్యాయామం: రోజులో కొద్దిసేపైనా వ్యాయామం చేయాలి. ఇది శరీరానికంతటికి రక్తప్రసరణ జరిగేలా చూస్తుంది. సహజ నొప్పి నివారిణిగా తోడ్పడే ఎండార్ఫిన్స్‌ విడుదలవుతాయి. బ్రిస్క్‌ వాక్‌, యోగా... వీటిలో నచ్చిన దాన్ని ఎంచుకోవచ్చు.

*  మంచినీరు: తగినన్ని నీటిని తీసుకోకపోతే డీహైడ్రేషన్‌తోపాటు టాక్సిన్లు శరీరంలోనే ఉండిపోయి మైగ్రేన్‌కు కారణమవుతాయి. రక్తప్రసరణా నెమ్మదిస్తుంది. మెదడుకు అవసరమైన పోషకాలు, ఆక్సిజన్‌ చేరవు. కాబట్టి రోజుకు కనీసం 2 నుంచి 3 లీటర్ల నీటిని తాగాలి.

*   ఎసెన్షియల్‌ ఆయిల్‌: తులసి, పెప్పర్‌మింట్‌, యూకలిప్టస్‌ నూనెలను నుదురు, కణతులకు పట్టించి, నెమ్మదిగా మర్దనా చేయాలి. వీటి సువాసనలు శరీరం రిలాక్స్‌ అయ్యేలా చూడటంతోపాటు ఉద్వేగాలనూ అదుపు చేస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్