Published : 13/09/2021 00:42 IST

విరామం తర్వాత ఉద్యోగానికి వెళ్తున్నారా?

ఓ ప్రైవేటు సంస్థలో పనిచేసే సుజాతకు పెళ్లికావడం, ఆ తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టడంతో కెరియర్‌కు విరామం ఇవ్వాల్సి వచ్చింది. ఎనిమిదేళ్ల తర్వాత తిరిగి విధుల్లో చేరాలనుకుంటోంది. ఇలాంటివారికి కెరీర్‌ నిపుణులు కొన్ని సూచనలిస్తున్నారు. అవేంటంటే...

అనుమానం వద్దు... ఇన్నేళ్ల తర్వాత తిరిగి ఉద్యోగాన్ని సంపాదించుకోగలుగుతామా అనే సందేహాన్ని మొదట మనసులోంచి తీసేయాలి. ఆత్మవిశ్వాసంతో ఉండాలి. గతంలోని విద్యార్హతతోపాటు అప్పటి అనుభవం ఇప్పుడు కూడా ఉపయోగపడుతుంది. అయితే ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్లు కొంత అప్‌డేషన్‌ అవసరం. ఆ నైపుణ్యాలను పెంచుకోగలిగితే చాలు. ఉద్యోగాన్ని సంపాదించగలరు.

రెజ్యూమ్‌ కొత్తగా...: ఏ ఉద్యోగానికైనా దరఖాస్తు చేసుకునేటప్పుడు మీ అర్హతలన్నీ చూపించేది రెజ్యూమే. అది కాస్త సృజనాత్మకంగా, మీ ఆలోచనలకు అద్దం పట్టేలా చూసుకోండి. అలానే అందులో మీ తాజా నైపుణ్యాల్నీ పొందుపరచండి. ఇవన్నీ ఉద్యోగవేటలో మీకు సానుకూలాంశాలు అవుతాయి. 

 స్పష్టత అవసరం: విరామం తర్వాత ఉద్యోగానికి వెళ్లాలనుకోవడం మంచిదే. కానీ ఇంటినీ, ఉద్యోగాన్నీ సమన్వయం చేసుకోగలరో లేదో స్పష్టత తెచ్చుకోండి. సందిగ్ధావస్థ ఉంటే... ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చూసుకోవడం మంచిది. అప్పుడే మీరు త్వరగా ఉద్యోగంలో కుదురుకోగలరు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి

సైజ్‌ జీరో కాదు.. ఆరోగ్యం ముఖ్యం!

‘మనసులో కలిగే ఆలోచనల్నే శరీరం ప్రతిబింబిస్తుంది..’ అంటోంది ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అంకితా కొన్వర్‌. సైజ్‌ జీరో గురించి ఆలోచిస్తూ బాధపడితే మరింత బరువు పెరుగుతామని, అదే ఆరోగ్యంపై దృష్టి పెడితే శరీరం, మనసు రెండూ మన అధీనంలో ఉంటాయని చెబుతోంది. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెడుతూ.. ఆ చిట్కాల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అందరిలో స్ఫూర్తి నింపే ఈ మిసెస్‌ సోమన్‌.. తాజాగా బాడీ పాజిటివిటీ గురించి ఇన్‌స్టాలో మరో స్ఫూర్తిదాయక పోస్ట్‌ పెట్టింది. సైజ్‌ జీరో కంటే ఆరోగ్యమే ముఖ్యమంటూ ఆమె షేర్‌ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

తరువాయి