కొండపల్లి గాజులతో... మిసెస్‌ ఇండియా!

పెళ్లై, పిల్లలు పుడితే ఇక సాధించడానికి ఏముంది అనుకునే వారికి విజయవాడ మహిళ బిల్లుపాటి మల్లిక చక్కని సమాధానాన్ని అందించారు. పెళ్లైన 13 ఏళ్ల తర్వాత మిసెస్‌ ఇండియాగా కిరీటాన్ని అందుకుని  శభాష్‌ అనిపించుకున్నారు..

Updated : 28 Dec 2021 05:39 IST

తెలుగమ్మాయి

పెళ్లై, పిల్లలు పుడితే ఇక సాధించడానికి ఏముంది అనుకునే వారికి విజయవాడ మహిళ బిల్లుపాటి మల్లిక చక్కని సమాధానాన్ని అందించారు. పెళ్లైన 13 ఏళ్ల తర్వాత మిసెస్‌ ఇండియాగా కిరీటాన్ని అందుకుని  శభాష్‌ అనిపించుకున్నారు.. ఎంబీఏ చేసి ఫ్యాషన్‌ ప్రపంచంలోకి అడుగు పెడదామని అనుకునేలోపే  పెళ్లయి పోయింది మల్లికకి. ఆ తర్వాత బాబు పుట్టాడు. చూస్తుండగానే 13 ఏళ్లు గడిచాయి. అయినా తన లక్ష్యాన్ని, సాధించాలనే తపనను మరచిపోలేదు. బాబు సొంతంగా పనులు చేసుకునే వయసుకు రావడంతో లక్ష్య సాధనకు నడుంకట్టారు. భర్త జితేంద్రప్రసాద్‌ ప్రోత్సాహమూ తోడవ్వడంతో ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టారు. కఠోర శ్రమతో తనని తాను మార్చుకున్నారు. 2020లో మిసెస్‌ ఆంధ్రప్రదేశ్‌ పోటీల్లో రన్నరప్‌గా నిలిచారు. కొవిడ్‌ సమయంలోనూ తీవ్రంగా శ్రమించారు. రోజూ ఉదయం 4 గంటల నుంచి జిమ్‌లో కసరత్తులు, యోగాసనాలు చేసేవారు. తర్వాత అంతర్జాలం ఆధారంగా ఇంటర్వ్యూలకు తయారవడం. అలా దేశవ్యాప్తంగా ఎందరో పోటీ పడిన 2021-22 మిసెస్‌ ఇండియా పోటీల్లో తుది జాబితాలో నిలిచారు. ఇటీవల ఉదయ్‌పూర్‌లో జరిగిన తొమ్మిదవ సీజన్‌ పోటీల్లో విజేతగా నిలిచారు. ఈ పోటీల్లో మల్లిక తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా సిద్ధమయ్యారు. వంటల రౌండ్‌లో చలివిడిని చేసి... ఉత్తర భారతీయులకు పరిచయం చేశారు. మరో రౌండ్‌లో కొండపల్లి గాజులను పరిచయం చేసి న్యాయనిర్ణేతలను ఆకర్షించారు. మొత్తమ్మీద తన ప్రతిభాపాటవాలతో వారిని మెప్పించి కిరీటాన్ని సొంతం చేసుకున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్