రైల్వేస్టేషన్‌ని నడిపేస్తున్నారు!

ముంబయిలోని మాతుంగ రైల్వేస్టేషన్‌కి ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే... ఈ స్టేషన్‌ని 2017 నుంచీ పూర్తిగా మహిళలే నిర్వహిస్తున్నారు. స్టేషన్‌ మాస్టర్‌ నుంచి మొదలుపెట్టి బుకింగ్‌ క్లర్కులుగా, ఆర్పీఎఫ్‌ పర్సనల్‌, టికెట్‌ చెకింగ్‌, అనౌన్సర్లుగా, పారిశుద్ధ్య

Published : 07 Mar 2022 00:14 IST

ముంబయిలోని మాతుంగ రైల్వేస్టేషన్‌కి ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే... ఈ స్టేషన్‌ని 2017 నుంచీ పూర్తిగా మహిళలే నిర్వహిస్తున్నారు. స్టేషన్‌ మాస్టర్‌ నుంచి మొదలుపెట్టి బుకింగ్‌ క్లర్కులుగా, ఆర్పీఎఫ్‌ పర్సనల్‌, టికెట్‌ చెకింగ్‌, అనౌన్సర్లుగా, పారిశుద్ధ్య కార్మికులుగా మొత్తం 41 మంది మహిళలు విధుల్లో ఉన్నారు. ఈ ప్రత్యేకత కారణంగానే లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లోకెక్కిన ఈ మాతుంగ రైల్వేస్టేషన్‌కి.. మమతా కులకర్ణి స్టేషన్‌ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తూ వీరందరికీ నేతృత్వం వహిస్తున్నారు. వీళ్ల అద్భుతమైన పనితీరుకు ప్రధాని నుంచి ప్రశంసలు కూడా అందుకున్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకున్న రైల్వే శాఖ హైదరాబాద్‌లోని బేగంపేట, విద్యానగర్‌ గాంధీనగర్‌ స్టేషన్లలోనూ మొత్తం మహిళా సిబ్బందినే నియమించింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్