కలయిక తర్వాత బ్లీడింగ్.. కారణమేమిటి?

హలో మేడమ్. నా బరువు 67 కిలోలు. ఎత్తు 4’8’’. నాకు పెళ్లై ఆరేళ్లవుతోంది. మూడేళ్లుగా పిల్లల కోసం ప్రయత్నిస్తున్నాం. అయితే కలయిక తర్వాత నాకు రక్తస్రావమవుతోంది. డాక్టర్ సలహా మేరకు యాంటీబయాటిక్స్ వాడాను. అయినా సమస్య....

Published : 14 Mar 2023 20:33 IST

హలో మేడమ్. నా బరువు 67 కిలోలు. ఎత్తు 4’8’’. నాకు పెళ్లై ఆరేళ్లవుతోంది. మూడేళ్లుగా పిల్లల కోసం ప్రయత్నిస్తున్నాం. అయితే కలయిక తర్వాత నాకు రక్తస్రావమవుతోంది. డాక్టర్ సలహా మేరకు యాంటీబయాటిక్స్ వాడాను. అయినా సమస్య తగ్గలేదు. పరిష్కారం చెప్పండి. - ఓ సోదరి

జ. మీకు కలయిక తర్వాత బ్లీడింగ్ అవుతోందంటే దాని గురించి మీరు అవసరమైన పరీక్షలన్నీ చేయించుకొని చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. Cervical Erosion, Bacterial Vaginosis వంటివి ఇందుకు కారణం కావచ్చు. అలాగే ఒక్కోసారి చిన్నపాటి పాలిప్స్, క్యాన్సర్ మొదలైనవి కూడా ఇందుకు కారణం కావచ్చు. యాంటీబయాటిక్స్ వాడినా సమస్య తగ్గలేదు కాబట్టి ఇంకా వివరంగా పరీక్షించాలి. పాప్‌స్మియర్ టెస్ట్, అల్ట్రాసౌండ్ స్కాన్ మొదలైన పరీక్షలతో పాటు గర్భాశయం లోపల కెమెరా పెట్టి హిస్టరోస్కోపీ కూడా చేయాల్సి రావచ్చు. వీటితో పాటు కొందరిలో బయాప్సీ కూడా చేస్తేనే అసలు సమస్యేంటో అర్థమవుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్