Summer Gadgets: పండ్ల కోసం ప్రత్యేకంగా..!

వేసవి అంటేనే ప్రత్యేకమైన పండ్ల సీజన్‌. పుచ్చ, తర్బూజా, మామిడి.. వంటి పండ్లు తినడానికి ఈ కాలంలో మనం ఎక్కువగా ఆసక్తి చూపుతాం. అయితే వీటిని కొనడం వరకు బాగానే ఉన్నా.. కట్‌ చేసుకోవడం, చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవడానికి చాలామంది బద్ధకిస్తుంటారు. ఇక పైపొట్టు గట్టిగా.....

Published : 13 Apr 2022 20:26 IST

(Photos: Amazon.in)

వేసవి అంటేనే ప్రత్యేకమైన పండ్ల సీజన్‌. పుచ్చ, తర్బూజా, మామిడి.. వంటి పండ్లు తినడానికి ఈ కాలంలో మనం ఎక్కువగా ఆసక్తి చూపుతాం. అయితే వీటిని కొనడం వరకు బాగానే ఉన్నా.. కట్‌ చేసుకోవడం, చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవడానికి చాలామంది బద్ధకిస్తుంటారు. ఇక పైపొట్టు గట్టిగా ఉండే పుచ్చకాయను కట్‌ చేసుకోవడానికి ఇంకాస్త ఓపిక కావాలి. మరి, ఇంతలా కష్టపడిపోకుండా క్షణాల్లో ఈ పండ్లను కట్‌ చేసుకోవాలంటే.. మార్కెట్లో దొరికే ఆయా ఫ్రూట్‌ స్లైసర్స్‌, పీలర్స్‌, కట్టర్స్‌ని ఇంటికి తెచ్చుకోవాల్సిందే!

మామిడి, పుచ్చకాయ, తర్బూజా.. వంటి సమ్మర్‌ ఫ్రూట్స్‌ కోసం ఆయా షేపుల్లో రూపొందించిన ప్రత్యేకమైన స్లైసర్స్‌ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇక వీటిని చిన్న చిన్న ముక్కల్లా కోసుకోవడానికీ కట్టర్స్‌ దొరుకుతున్నాయి. పిల్లల కోసం ప్రత్యేకమైన ఆకారాల్లో కట్‌ చేసుకోవడానికి అచ్చులూ అందుబాటులోకొచ్చాయి. అంతేకాదు.. మామిడిపై చెక్కు తీసే క్రమంలో జ్యూస్‌, వాటి తొక్కలు కింద పడిపోకుండా ఉండేందుకు స్పెషల్‌ పీలర్‌ అందుబాటులోకొచ్చింది. వీటిని ఉపయోగిస్తే క్షణాల్లో పని పూర్తవుతుంది.. పెద్దగా శ్రమ పడాల్సిన అవసరమూ ఉండదు. అలాంటి కొన్ని ఫ్రూట్‌ గ్యాడ్జెట్స్‌ని ఈ ఫొటోల్లో చూసేయండి!

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్