ఆరోగ్యానికి NO.. అందానికి YES..!

పంచదార.. ఆరోగ్యానికి మంచిది కాదు.. కానీ మన అందాన్ని సంరక్షించడంలో మాత్రం చక్కెరది కూడా ముఖ్య పాత్రే. చర్మం మీద ఉండే మృతకణాలను తొలగించడం.. చర్మాన్ని ప్రకాశవంతంగా మెరిపించడం వంటి గుణాలు దీనికి ఉన్నాయి. ఈ క్రమంలో- సౌందర్య సంరక్షణకు పంచదారని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చో ఓసారి చూద్దాం రండి..

Published : 08 Feb 2022 19:53 IST

పంచదార.. ఆరోగ్యానికి మంచిది కాదు.. కానీ మన అందాన్ని సంరక్షించడంలో మాత్రం చక్కెరది కూడా ముఖ్య పాత్రే. చర్మం మీద ఉండే మృతకణాలను తొలగించడం.. చర్మాన్ని ప్రకాశవంతంగా మెరిపించడం వంటి గుణాలు దీనికి ఉన్నాయి. ఈ క్రమంలో- సౌందర్య సంరక్షణకు పంచదారని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చో ఓసారి చూద్దాం రండి..

చర్మం ప్రకాశవంతంగా..

తేనె, నిమ్మరసం సమపాళ్లలో తీసుకుని అందులో కాస్త చక్కెర వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకి బాగా పట్టించి కాసేపయ్యాక గుండ్రంగా, మృదువుగా మర్దన చేస్తూ శుభ్రం చేసుకుంటే చర్మం మీద ఉండే మృతకణాలు తొలగిపోవడమే కాకుండా ముఖం ప్రకాశవంతంగా కూడా కనిపిస్తుంది.

మృతకణాలు తొలగించడానికి..

చర్మం మీద పేరుకున్న మృతకణాలను తొలగించడంలో చక్కెర సహజసిద్ధమైన స్క్రబ్‌లా పనిచేస్తుంది. కొద్దిగా తేనె తీసుకుని అందులో చెంచా చక్కెర, బాదంనూనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకి అప్త్లె చేసుకుని 10 నిమిషాలు ఆరనిచ్చి తర్వాత మృదువుగా, గుండ్రంగా మర్దన చేసుకోవాలి. ఫలితంగా చర్మంపై పేరుకున్న మృతకణాలు మాత్రమే కాకుండా దుమ్ము, ధూళి వంటివి కూడా తొలగిపోతాయి. అధికంగా ఉండే నూనెల్ని కూడా చక్కెర పీల్చేసుకుని జిడ్డుదనాన్ని తగ్గిస్తుంది.

నలుపుదనం తగ్గడానికి..

చాలామంది మహిళల్లో మోకాళ్లు, మోచేతుల దగ్గర ఉండే చర్మం గరుగ్గా, నల్లగా ఉంటుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో వీటి వల్ల ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశాలు లేకపోలేవు. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి కొన్ని గులాబీ రేకల్ని తీసుకుని ఆరబెట్టి పొడిగా చేసుకోవాలి. అలా సిద్ధం చేసుకున్న గులాబీ రేకల పొడికి రెండు లేదా మూడు చెంచాల చక్కెర, ఆలివ్‌నూనె జత చేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంతో మోచేతులు, మోకాళ్ల దగ్గర నల్లగా ఉన్న ప్రదేశంలో రుద్దితే మంచి ఫలితం ఉంటుంది. ఇలా చేస్తే నలుపుదనం క్రమేపీ తగ్గుతుంది. అలాగే కంప్యూటర్ ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల కొంతమందికి అరచేతుల దగ్గర నల్లగా మచ్చలు ఏర్పడుతుంటాయి. ఈ చిట్కా పాటిస్తే వాటి నుంచి కూడా సులభంగా బయటపడచ్చు.

బ్రౌన్ షుగర్‌తో..

చక్కెరను ఉపయోగించమన్నాం కదాని మరీ పెద్ద పెద్ద పలుకులు ఉన్నది ఉపయోగిస్తే చర్మానికి హాని జరిగే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న పలుకులతో మృదువుగా ఉన్న చక్కెరని మాత్రమే సౌందర్య సంరక్షణకి ఉపయోగించాలి. అలాగే బ్రౌన్ షుగర్ అందుబాటులో ఉంటే దాన్ని పొడిగా చేసుకుని కూడా సాధారణ చక్కెర బదులు ఉపయోగించుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్