అబార్షన్‌ తర్వాత నుంచీ జ్వరం.. కారణమేంటి?

హాయ్‌ డాక్టర్‌. నేను ఐవీఎఫ్‌ చికిత్స తీసుకున్నాను. మూడు పిండాలు ఏర్పడ్డాయి. అయితే అందులో ఒక బేబీకి రెండు తలలు వచ్చాయి. అప్పుడు ఫీటల్‌ డిటెక్షన్‌ చేసి రెండు పిండాలు ఉంచారు. అయితే ఐదో నెలలో అబార్షన్‌ అయింది. తర్వాత Dilation and Curettage (D&C) చేశాక వారానికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఇప్పుడు కొవిడ్‌ నుంచి కోలుకున్నా. అయితే D&C చేసినప్పట్నుంచి జ్వరం వస్తోంది.  మాత్ర వేసుకుంటే తగ్గుతుంది.. ఆపేశాక మళ్లీ వస్తుంది. ఎందుకిలా జరుగుతోంది? దయచేసి సలహా ఇవ్వగలరు.

Published : 04 Jul 2021 14:36 IST

- ఓ సోదరి

జ: మీకు జ్వరం రావడానికి కారణమేంటో తెలుసుకోవాలంటే మీకు ఉన్న ఇతర లక్షణాలు, వాటితో పాటు కొన్ని పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అబార్షన్‌ తర్వాత ఇన్ఫెక్షన్‌ వల్ల జ్వరం వచ్చుంటే.. మీకు పొత్తి కడుపులో నొప్పి, బ్లీడింగ్‌, దుర్వాసనతో కూడిన డిశ్చార్జి.. వంటి లక్షణాలు కనిపిస్తాయి. లేదా మీకు కొవిడ్‌ కూడా వచ్చింది కాబట్టి కొవిడ్‌కు సంబంధించిన కాంప్లికేషన్స్‌ వల్ల కానీ లేదంటే ఈ రెండూ కాకుండా ఇతర కారణాల వల్ల కానీ జ్వరం రావచ్చు. అందుకని మీరు ఒకసారి మీ గైనకాలజిస్ట్‌ని, మీకు కొవిడ్‌ చికిత్స చేసిన ఫిజీషియన్‌ని సంప్రదిస్తే వారు మీకు సరైన సలహా ఇవ్వగలుగుతారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్