వారానికో ఐదు గంటలు..

ఉద్యోగినులుగా మన పనితీరులో వేలుపెట్టడానికి ఉండదు!

Updated : 27 Nov 2022 12:43 IST

ద్యోగినులుగా మన పనితీరులో వేలుపెట్టడానికి ఉండదు! ఉత్పాదకతలోనూ సమస్యా రాదు. ఇన్ని ఉన్నా ఉద్యోగంలో అభివృధ్ధి ఉండదు. కొత్త విషయాలూ, అంశాలూ నేర్చుకోకపోవడం ఇందుకో కారణం. రోజుకో గంట.. లేదా వారంలో కనీసం ఐదుగంటలు ఇందుకోసం కేటాయిస్తే అద్భుతాలు సాధించవచ్చంటున్నారు నిపుణులు. అదెలాగంటే..
ఇవి గుర్తుంచుకోండి : పనికీ, నేర్చుకోవడానికీ మధ్యా, ఉత్పాదకతా, అభివృద్ధికీ నడుమా తేడా తెలుసుకోండి. పనీ, ఉత్పాదకతలో చక్కగా ఉంటే ఉద్యోగిగా మనకు ఢోకా లేకపోవచ్చు. కానీ నిరంతర అభివృద్ధి సాధ్యం కాదు. అందుకు నేర్చుకోవడం, కొత్త ఆలోచనలకి పదునుపెట్టడం ఒక్కటే దగ్గరి దారి.
కొత్త ఆలోచనలు : కొత్త విషయాలూ, అంశాలు నేర్చుకోవడమంటే ఏదో ఒక కోర్సులో చేరడమే అనుకోకండి. ఉద్యోగానికి సంబంధించో లేకపోతే మీ భవిష్యత్తు ప్రణాళిక గురించో, మీకెప్పుడో తట్టిన సొంత వ్యాపార ఆలోచనపైన కూడా ఆలోచించండి. ఆ గంటలోనే అంతర్జాలంలో వాటిపై పరిశోధించండి.ఇది కూడా అభివృద్ధిలో భాగమే!
చదవండి.. : పుస్తకాలు చదవడం ఎప్పటికప్పుడు మీ ఆలోచనాపరిధినీ పెంచుతూ ఉంటుంది. అది మీలో నిత్యం ఆత్మవిశ్వాసం నిండేలా చేస్తుంది. మిమ్మల్నో మంచి నాయకురాలిగా నిలుపుతుంది. ‘పూర్తి అంతర్ముఖుడినైన నన్ను ఓ మంచి నాయకుడిగా నిలిపింది పుస్తక పఠనమే!’ అంటారు మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌. ఏడాదికి 50 పుస్తకాలు చదువుతారాయన!
సమీక్షకో గంట : వారానికి ఐదుగంటలు అనుకున్నాం కదా! మీరు ఏది చదివినా, కొత్త ఆలోచనలకు ఎంతగా సానబెట్టినా వాటిని సమీక్షించుకునేందు కోసం కనీసం ఓ గంటైనా కేటాయించండి. అది మీకూ మీ ఆలోచనలకూ ఓ స్థిరత్వాన్నిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్