ముంజేతికో శానిటైజర్‌

జిమ్‌, పార్కుల్లో.. వ్యాయామం చేసేటప్పుడు లేదా బయటకు వెళ్లేటప్పుడు మణికట్టుకు మెరిసే రిస్ట్‌బ్యాండులు... ఇప్పుడు కొత్త అవసరాలు. అదే సమయంలో శానిటైజర్‌నూ పట్టుకుని తిరగాల్సిన పరిస్థితి.

Published : 02 Jul 2021 01:08 IST

జిమ్‌, పార్కుల్లో.. వ్యాయామం చేసేటప్పుడు లేదా బయటకు వెళ్లేటప్పుడు మణికట్టుకు మెరిసే రిస్ట్‌బ్యాండులు... ఇప్పుడు కొత్త అవసరాలు. అదే సమయంలో శానిటైజర్‌నూ పట్టుకుని తిరగాల్సిన పరిస్థితి. దీనికో పరిష్కారం ఆలోచించారు సృజనాత్మక వ్యాపారులు. రిస్ట్‌బ్యాండులకే శానిటైజర్‌ను జోడించారు. ఇవి శానిటైజర్‌ నింపడానికి వీలుగా, రకరకాల ఆకారాల్లో అందంగా... చేతికి ఇమిడిపోతున్నాయి. కాస్త ప్రెస్‌ చేస్తే చాలు.. అరచేతిలోకి శానిటైజర్‌ని చిమ్ముతాయి. బ్రాస్‌లెట్స్‌, రిస్ట్‌వాచీలుగా పలు రూపాల్లో... ఆకర్షిస్తూనే క్రిముల్ని తరిమేస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్