చుండ్రుతో ఇబ్బందా?

అందంగా కనిపించాలని సౌందర్య సాధనాలు వాడుతుంటాం. కానీ వాటిల్లో అధిక శాతం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో హాని చేసేవే. అందుకు ప్రత్యామ్నాయంగా సహజసిద్ధమైనవి వాడి ఆకర్షణీయంగా కనిపించండి...

Published : 27 Dec 2021 00:42 IST

అందంగా కనిపించాలని సౌందర్య సాధనాలు వాడుతుంటాం. కానీ వాటిల్లో అధిక శాతం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో హాని చేసేవే. అందుకు ప్రత్యామ్నాయంగా సహజసిద్ధమైనవి వాడి ఆకర్షణీయంగా కనిపించండి...

* చర్మ మృదుత్వం కోసం, పగలకుండా, పొడిబారకుండా ఉండాలని మాయిశ్చరైజర్లు రాస్తుంటాం. కానీ అవన్నీ రసాయనభరితాలే. వాటికి బదులుగా వారానికి ఒకరోజు అలోవెరా గుజ్జులో తేనె కలిపి రాస్తే సరిపోతుంది. చర్మసౌందర్యమే కాదు, దురద, మంట లాంటి సమస్యలు తలెత్తవు.

* చుండ్రు, పేలు లాంటి సమస్యలకు మార్కెట్‌లో దొరికే ఔషధాలు ఉపయోగిస్తాం. కానీ వాటివల్ల కంటి చూపు తగ్గే ప్రమాదముంది. వేపాకు నూరి తలకు పట్టించడం ద్వారా పేలు, చుండ్రు సమస్యలను నివారించవచ్చు.

* ఈ తరం అమ్మాయిలకు హెయిర్‌ ఫాల్‌ అనేది అతి పెద్ద సమస్య. దాన్ని తగ్గించుకోవడం కోసం మందులు వాడటం, తలనూనెలు మార్చడం తెలిసిందే. అందుకు బదులుగా పదిహేను రోజుల పాటు క్రమం తప్పకుండా కొబ్బరిపాలు తలకు పట్టిస్తే చాలు ఒత్తయిన కురులు మీ సొంతమవుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్