తొక్కతో పళ్లకు మెరుపు

ముత్యాల్లాంటి తెల్లని పలువరుస మీ అందానికి అదనపు ఆభరణం అవుతుంది. అయితే పచ్చటి దంతాలు ఆ అందాన్ని పోగొడతాయి. అలా కాకుండా ఉండాలంటే...

Updated : 09 Sep 2022 11:58 IST

ముత్యాల్లాంటి తెల్లని పలువరుస మీ అందానికి అదనపు ఆభరణం అవుతుంది. అయితే పచ్చటి దంతాలు ఆ అందాన్ని పోగొడతాయి. అలా కాకుండా ఉండాలంటే...

కారణాలివీ...

* టీ, కాఫీ, శీతలపానీయాలు ఎక్కువగా తాగడం, అనారోగ్య కరమైన ఆహారపుటలవాట్లు.

* జన్యులోపాలు

* యాంటీబయాటిక్స్‌, యాంటీ హిస్టమైన్స్‌, రక్తపోటు మందులు, మానసిక అనారోగ్యానికి వాడే మందులు

* తీపి ఎక్కువగా తినడం వంటివి దంతాల అందాన్ని తగ్గిస్తాయి.

గుర్తుంచుకోండి...

* కూల్‌డ్రింక్స్‌ను స్ట్రాతోనే తాగాలి.

* జంక్‌ ఫుడ్‌కు బదులు తాజా పండ్లు, కూరగాయలను ఆహారంలో చేర్చుకోవాలి. పాలు, పెరుగు, మజ్జిగ, క్యారెట్‌, స్ట్రాబెర్రీ, కొత్తిమీర లాంటి వాటిని బాగా తీసుకోవాలి.

వేప.. వేప పుల్లలను టూత్‌ బ్రష్‌గా వాడండి. టూత్‌పేస్ట్‌లో కొన్ని చుక్కల వేప నూనె వేసుకుని తోమినా ప్రయోజనం ఉంటుంది.

యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌... దీనికి సమాన పరిమాణంలో నీటిని కలిపి ఆ ద్రావణంతో కాసేపు పుక్కిలించాలి. ఇలా చేస్తే దంతాల పసుపుదనం పోతుంది.

అరటిపండు తొక్కలు.. వీటితో దంతాలపై క్రమం తప్పకుండా మృదువుగా రుద్దితే పసుపు రంగు పోతుంది. చిగుళ్లు గట్టిపడతాయి.


ఇంకా..

* పదిహేను, ఇరవై తులసి ఆకులను మెత్తగా నూరి బొగ్గుతో కలిపి పళ్లు తోముకోవాలి. ఇలా క్రమం తప్పక చేస్తే తెల్లటి పలు వరుస మీ సొంతమవుతుంది.

* చెంచా చొప్పున ఆలివ్‌ నూనె, నిమ్మరసాన్ని కలిపి అయిదు నిమిషాలు దంతాలను తోమాలి. తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. రోజూ పడుకోబోయే ముందు ఇలా చేస్తే మార్పు కనిపిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్