వేసవిలో చల్లని ఫేస్‌వాష్‌లు..

ఎండ వేడికి ముఖం కమిలి పోతుంటుంది. ఇటువంటప్పుడు ఇంట్లోనే తయారు చేసుకొనే సహజసిద్ధమైన ఫేస్‌వాష్‌లతో  నిత్యం ముఖాన్ని తాజాగా ఉంచుకోవచ్చు. అటువంటి చల్లచల్లని ఫేస్‌వాష్‌ల తయారీ ఎలాగో చూద్దాం.

Published : 03 Jun 2022 00:54 IST

ఎండ వేడికి ముఖం కమిలి పోతుంటుంది. ఇటువంటప్పుడు ఇంట్లోనే తయారు చేసుకొనే సహజసిద్ధమైన ఫేస్‌వాష్‌లతో  నిత్యం ముఖాన్ని తాజాగా ఉంచుకోవచ్చు. అటువంటి చల్లచల్లని ఫేస్‌వాష్‌ల తయారీ ఎలాగో చూద్దాం.

క్యారెట్‌తో..

ఒక బేబీ సోప్‌ను తీసుకొని చిన్నగా తురుముకోవాలి. మూడు క్యారెట్లను ముక్కలుగా చేసి మిక్సీలో వేయాలి. నీటికి బదులుగా అరకప్పు గులాబీ నీటిని వేసి మెత్తగా చేసి రసాన్ని వడకట్టు కోవాలి. దీన్ని ఓ గిన్నెలో తీసుకొని బేబీ సోప్‌ తురుము, నాలుగు చెంచాల యాపిల్‌ సిడర్‌ వెనిగర్‌, రెండు చెంచాల తేనె వేసి బాగా గిలకొట్టాలి. ఇందులో అరచెంచా ఫిష్‌ ఆయిల్‌ వేసి మరోసారి బాగా షేక్‌ చేస్తే చాలు, క్యారెట్‌ ఫేస్‌వాష్‌ సిద్ధం. దీన్ని ఓ పొడి గాజు సీసాలో నింపి ఫ్రిజ్‌లో ఉంచితే రెండు వారాలు నిల్వ ఉంటుంది. ఉదయం, సాయంత్రం దీంతో ముఖాన్ని శుభ్రం చేస్తే మృతకణాలు తొలగి, చర్మం మృదువుగా మారి మెరుపులీనుతుంది. ముందుగానే వచ్చే వృద్ధాప్య ఛాయలను దరి చేరనివ్వదు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్‌ ముఖంపై మొటిమలు, మచ్చలను రానివ్వవు.

కీరదోసతో..

బేబీ సోప్‌ను పొడిగా తురుము కోవాలి. రెండు లేదా మూడు కీరదోస కాయలను చిన్నగా తురిమి మిక్సీలో వేసి రసాన్ని వడకట్టుకోవాలి. ఇందులో అరకప్పు గులాబీ నీటిని, సిద్ధం చేసుకున్న సబ్బు పొడిని కలపాలి. ఈ మిశ్రమంలో రెండు మూడు చుక్కల ఎస్సెన్షియల్‌ ఆయిల్‌, చెంచా నిమ్మ రసం వేసి ఎలక్ట్రిక్‌ బీటర్‌తో నురగలా అయ్యే వరకు గిలకొట్టి పొడి సీసాలో నింపాలి. ఫ్రిజ్‌లో దీన్ని ఓ వారం నిల్వ ఉంచుకోవచ్చు. ఉదయం ఈ ఫేస్‌వాష్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే రోజంతా తాజాగా ఉంటుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్‌, సి విటమిన్‌, ఖనిజలవణాలు, పోషకాలు ముఖ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఫోలిక్‌ యాసిడ్‌ ముఖాన్ని మెరిపిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్