ఇంట్లోనే చేద్దాం బాడీవాష్‌లు

ఒకటిన్నర కప్పు ద్రవరూప కాస్టిల్‌ సోపును తీసుకొని పొడి సీసాలో పోయాలి. ఇందులో నాలుగు చెంచాల గ్లిజరిన్‌, 10 చుక్కల పెపర్‌మెంట్‌, లావెండర్‌, గులాబీ ఎసెన్షియల్‌ నూనెలు వేసి బాగా కలిపితే చాలు. ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ బాడీవాష్‌ సిద్ధమవుతుంది. దాదాపు ఏడాది పాటు వినియోగించుకోవచ్చు. చర్మం మృదువుగా మారుతుంది.

Published : 08 Aug 2022 00:41 IST

రసాయనాలున్న బాడీవాష్‌లు కాకుండా, ఇంట్లోనే, సహజ పదార్థాలతో తయారు చేసే వాటితో చర్మసౌందర్యాన్ని మెరుగు పరచుకోవచ్చు అంటున్నారు నిపుణులు.

కటిన్నర కప్పు ద్రవరూప కాస్టిల్‌ సోపును తీసుకొని పొడి సీసాలో పోయాలి. ఇందులో నాలుగు చెంచాల గ్లిజరిన్‌, 10 చుక్కల పెపర్‌మెంట్‌, లావెండర్‌, గులాబీ ఎసెన్షియల్‌ నూనెలు వేసి బాగా కలిపితే చాలు. ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ బాడీవాష్‌ సిద్ధమవుతుంది. దాదాపు ఏడాది పాటు వినియోగించుకోవచ్చు. చర్మం మృదువుగా మారుతుంది.

రెండు కప్పుల లిక్విడ్‌ కాస్టిల్‌ సబ్బులో మూడు చెంచాల బాదం నూనె, చెంచా చొప్పున నిమ్మరసం, గులాబీ నీరు, 20 చుక్కల లావెండర్‌ ఎసెన్షియల్‌ నూనె వేసి బాగా కలిపి పొడి సీసాలో భద్రపరుచుకోవాలి. ఇది రెండు వారాలు నిల్వ ఉంటుంది. పొడి చర్మానికిది మృదుత్వాన్ని ఇస్తుంది.

తేనెతో..

అరకప్పు లిక్విడ్‌ కాస్టిల్‌ సబ్బును ఒక సీసాలోకి తీసుకోవాలి. దీనికి అరకప్పు తేనె, రెండు చెంచాల చొప్పున ఆముదం, ఆలివ్‌ నూనె, 10 చుక్కల లెమన్‌ ఎస్సెన్షియల్‌ నూనె వేసి బాగా కలిపితే చాలు. ఈ బాడీవాష్‌ చర్మాన్ని తేమగా ఉంచుతుంది. దీన్ని 10 నెలలు భద్రపరుచుకోవచ్చు.

అరకప్పు చొప్పున కాస్టిల్‌ లిక్విడ్‌ సబ్బు, తేనె, ఆలివ్‌ నూనె, 50 చుక్కల లావెండర్‌ ఎసెన్షియల్‌ నూనె తీసుకొని పొడి సీసాలో పోసి బాగా కలపాలి. ఈ బాడీవాష్‌ ఏడాదిపాటు నిల్వ ఉంటుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా మృదువుగా మారుస్తుంది.
జిడ్డు చర్మానికి..

ఆరు కప్పుల డిస్టిల్డ్‌ వాటర్‌కు అరకప్పు లిక్విడ్‌ కాస్టిల్‌ సబ్బు కలపాలి. ఇందులో ముందుగానే వేపాకులను మరగించి వడకట్టిన నీటిని రెండు చెంచాలు, అరకప్పు కొబ్బరినూనె, 15 చుక్కల లావెండర్‌ ఎసెన్షియల్‌ నూనె వేసి బాగా కలపాలి. ఈ బాడీవాష్‌తో స్నానం చేస్తే జిడ్డు తత్వం దూరమై, చర్మం తాజాగా కనిపిస్తుంది. దీన్ని ఆరునెలల వరకు భద్రపరుచుకోవచ్చు.

అరకప్పు షియా బటర్‌ను అవెన్‌లో వేడిచేసి అందులో అరకప్పు బాదం నూనె కలపాలి. ఈ మిశ్రమంలో కప్పు లిక్విడ్‌ కాస్టిల్‌ సబ్బు, 10 చుక్కల రోజ్‌ ఎసెన్షియల్‌ నూనె వేసి ఒక పొడి సీసాలోకి తీసుకుంటే 6 నెలలు నిల్వ ఉంటుంది. సున్నిత చర్మతత్వం ఉన్న వారికి ఈ బాడీవాష్‌ మంచి ఫలితాన్నిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్