మేకప్‌ తొలగిద్దామిలా..

ఉదయం వేసిన మేకప్‌తోపాటు రోజంతా ముఖంపై పేరుకున్న దుమ్ము, ధూళిని రాత్రి నిద్రపోయేముందు తప్పనిసరిగా శుభ్రపరుచుకోవాలి. లేదంటే మొటిమలు, మచ్చలతోపాటు చర్మం పేలవంగా మారే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. ఇంట్లోనే సహజ క్లెన్సర్లనెలా తయారుచేసుకోవచ్చో కూడా చెబుతున్నారు..

Published : 22 Aug 2022 00:35 IST

ఉదయం వేసిన మేకప్‌తోపాటు రోజంతా ముఖంపై పేరుకున్న దుమ్ము, ధూళిని రాత్రి నిద్రపోయేముందు తప్పనిసరిగా శుభ్రపరుచుకోవాలి. లేదంటే మొటిమలు, మచ్చలతోపాటు చర్మం పేలవంగా మారే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. ఇంట్లోనే సహజ క్లెన్సర్లనెలా తయారుచేసుకోవచ్చో కూడా చెబుతున్నారు..

హజ లేదా పొడిచర్మం ఉన్నవారు క్లెన్సింగ్‌ క్రీం లేదా జెల్‌తో మేకప్‌ను శుభ్రపరచాలి. అదే జిడ్డు చర్మం ఉన్నవారైతే ఫేస్‌వాష్‌ లేదా లైట్‌ క్లెన్సింగ్‌ మిల్క్‌తో ముఖంపై మృదువుగా మర్దనా చేసి మృదువైన కాటన్‌ వస్త్రంతో తుడవాలి. అయితే ఎటువంటి చర్మం ఉన్నవారైనా కంటి కింద, పెదవుల చుట్టూ ఉండే సున్నితమైన చర్మం ఉన్నచోట క్లెన్సింగ్‌జెల్‌తో మేకప్‌ను తొలగించుకోవచ్చు. ఇటువంటప్పుడు ఒత్తిడిగా కాకుండా మృదువుగానే శుభ్రం చేయాలి. ఉంగరంవేలితో క్లెన్సింగ్‌ జెల్‌ను ఆ ప్రాంతంలో రాసి మృదువుగా రుద్ది కాటన్‌ వస్త్రంతో పలుదిశల్లో కాకుండా ఒకే దిశగా తుడవాలి. అలాగే మస్కారా శుభ్రం చేయడంలో ముందుగా పై కనురెప్పలను ఎంచుకోవాలి. నూలువస్త్రంపై క్లెన్సర్‌ వేసి చూపుడువేలుకు చుట్టుకొని కనురెప్పలకు రాసి తుడవాలి. కాటన్‌బడ్‌పై కొంచెంగా క్లెన్సర్‌ క్రీం వేసి కింది కనుమూలల నుంచి రెప్పలను మృదువుగా శుభ్రపరచాలి. మెత్తని కాటన్‌వస్త్రానికి కొంచెం క్లెన్సర్‌ రాసి పెదవుల మూలల నుంచి మధ్యకు మృదువుగా తుడుస్తూ శుభ్రపరచాలి. ఆ తర్వాత రసాయనరహిత క్లెన్సర్‌తో శుభ్రంగా ముఖాన్ని కడగాలి.

సహజసిద్ధంగా..

అరకప్పు పాలల్లో అయిదు చుక్కల ఆలివ్‌ లేదా సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ కలిపిన మిశ్రమాన్ని ఒక పొడిసీసాలోకి తీసుకోవాలి. పొడిచర్మం ఉన్నవారు మేకప్‌ శుభ్రం చేసుకోవాలన్నప్పుడు ఈ మిశ్రమాన్ని మెత్తని కాటన్‌ వస్త్రంపై వేసి ముఖానికి అప్లై చేసి మర్దనా చేసి తుడిస్తే చాలు. దీన్ని ఒకరోజు మాత్రమే ఫ్రిజ్‌లో భద్రపరుచుకోవచ్చు. జిడ్డు చర్మం ఉన్నవారు పావుకప్పు నిమ్మరసంలో చెంచా చొప్పున కీరదోస రసం, పాలను కలిపిన మిశ్రమంతో మేకప్‌ను తొలగించుకోవచ్చు. అలాగే ఎంజైమ్స్‌ పుష్కలంగా ఉండే బొప్పాయి మంచి క్లెన్సర్‌గా పనిచేస్తుంది. మేకప్‌ తొలగించిన తర్వాత బొప్పాయి గుజ్జును ముఖానికి పట్టించి పావుగంట తర్వాత కడిగితే మృతకణాలు దూరమవుతాయి. బంగాళదుంప రసం జిడ్డు చర్మంవారికి బాగా ఉపయోగపడుతుంది. నాలుగుచెంచాల ఈ దుంప రసానికి సరిపోయేలా ముల్తానీమట్టి కలిపి పేస్టులా చేసి మేకప్‌ తొలగించిన తర్వాత ముఖానికి రాసి ఆరనిచ్చి శుభ్రపరుచుకుంటే చాలు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్