కొత్త ఏడాదిలో విజయం మీదే!

ఇంటిల్లిపాదీ అందరి అవసరాలు తీర్చే మనం శారీరకంగా, మానసికంగా ఫిట్‌గా ఉండటం చాలా అవసరం. ఇందుకోసం కొత్త సంవత్సరంలో అయినా మీరు పెట్టుకున్న నియమాలు, లక్ష్యాలను సాధించడానికి ఇలా చేయండి..

Published : 27 Dec 2021 00:42 IST

ఇంటిల్లిపాదీ అందరి అవసరాలు తీర్చే మనం శారీరకంగా, మానసికంగా ఫిట్‌గా ఉండటం చాలా అవసరం. ఇందుకోసం కొత్త సంవత్సరంలో అయినా మీరు పెట్టుకున్న నియమాలు, లక్ష్యాలను సాధించడానికి ఇలా చేయండి..

లక్ష్యాన్ని సాధించాలన్నా శారీరక ఆరోగ్యం ముఖ్యం. ఇందుకోసం వ్యాయామం తప్పనిసరి. ప్రతిరోజూ వర్కవుట్లు చేయాలని ఉన్నా... పని ఒత్తిడి లేదా బద్ధకం ఆవరించడంతో వెనుకడుగు పడుతూ ఉంటుంది. కొందరైతే కొన్నిరోజులపాటు ఉత్సాహాన్ని చూపించి, ఆ తర్వాత మానేస్తారు. అలాకాకుండా ఫిట్‌నెస్‌కు ప్రాముఖ్యతనిచ్చేవారిని స్ఫూర్తిగా తీసుకోవాలి. మొదటిరోజునే ఎక్కువసేపు కాకుండా, సమయాన్ని పెంచుకుంటూ ఉంటే కొన్ని రోజులకు అది అలవాటుగా మారుతుంది. ముందుగానే వ్యాయామాలు అని కాకుండా ఉదయం లేదా సాయంత్రంవేళల్లో కొంత సమయాన్ని కేటాయించుకుని నడక, సైక్లింగ్‌, స్కిప్పింగ్‌, మెట్లు ఎక్కిదిగడం వంటివి ఎంచుకుని చేస్తే మంచిదే. క్రమేపీ వర్కవుట్లపై ఆసక్తి పెరుగుతుంది. ఒంటరిగా చేయలేకపోతే  ఇంటి సభ్యులను లేదా స్నేహితులను జత చేసుకుంటే చాలు. మీ దైనందిన చర్యల్లో వ్యాయామం కూడా ఓ భాగమవుతుంది. దీంతోపాటు యోగా, మెడిటేషన్‌ వంటివి జతచేస్తే మానసికారోగ్యం దరిచేరుతుంది. ఆకలికి ఏదో ఒక ఆహారం అని కాకుండా పోషక విలువలకు ప్రాధాన్యం ఇవ్వాలి. రసాయనాలున్న ప్రాసెసింగ్‌ ఫుడ్స్‌, చక్కెర, ఉప్పు, మైదా వంటివాటికి దూరంగా ఉండా¥లి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్