కలరియపట్టు నేర్చుకున్నా!

సైనా నెహ్వాల్‌ బయోగ్రఫీలో కథానాయకిగా తన నటనతో మెప్పించి తెలుగువారి అభిమానాన్నీ పొందిన బాలీవుడ్‌ నటి పరిణితిచోప్రా తన అందం, ఆరోగ్యం వెనుక రహస్యాలను చెప్పుకొచ్చిందిలా... ‘ప్రతిరోజు నిద్రలేవగానే మనసులో ‘ఈ రోజు ఆరోగ్యకరమైన పద్ధతులను పాటించి నన్ను నేను అందంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తా’ అని గట్టిగా అనుకుంటా... పాటిస్తా.  అశ్రద్ధగా ఉంటే ఈ ప్రభావం చర్మంపై...

Published : 20 Jan 2022 01:04 IST

సైనా నెహ్వాల్‌ బయోగ్రఫీలో కథానాయకిగా తన నటనతో మెప్పించి తెలుగువారి అభిమానాన్నీ పొందిన బాలీవుడ్‌ నటి పరిణితిచోప్రా తన అందం, ఆరోగ్యం వెనుక రహస్యాలను చెప్పుకొచ్చిందిలా...

‘ప్రతిరోజు నిద్రలేవగానే మనసులో ‘ఈ రోజు ఆరోగ్యకరమైన పద్ధతులను పాటించి నన్ను నేను అందంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తా’ అని గట్టిగా అనుకుంటా... పాటిస్తా.  అశ్రద్ధగా ఉంటే ఈ ప్రభావం చర్మంపై అయిదేళ్ల తర్వాత బయటపడుతుంది. ఆ తర్వాత వచ్చే సమస్యలను దూరం చేసుకోవడం కష్టం. చిన్నప్పటి నుంచే నా ముఖం, మెడ, చేతులకు కలబంద గుజ్జు రసాన్ని రాసుకోవడం అమ్మ నేర్పింది. ఇది నా చర్మాన్ని మృదువుగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే శిరోజాలకి తరచూ కొబ్బరినూనె మర్దన చేస్తా. ఇక ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యమిస్తా. ప్రతిరోజూ ఒకేలాంటి వ్యాయామాలు విసుగ్గా అనిపిస్తాయి. కాసేపు ట్రెడ్‌మిల్‌పై నడుస్తా. గంటకుపైగా ఈత కొడతా. కేరళ సంప్రదాయ యుద్ధకళ కలరియపట్టుని కష్టపడి నేర్చుకున్నా. దాన్నీ సాధన చేస్తా. ఇలా రకరకాలుగా కొత్తవి కలుపుకొంటూ వ్యాయామాలుగా చేయడంతో ఉత్సాహంగా ఉంటుంది.’

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్