గదిగదికీ కొమ్మలు

నిద్రలేచిన వెంటనే ప్రకృతిలో మమేకమై ఉన్నట్లు అనిపిస్తే ఆ ఆనందమే వేరు. ఆ భావన రావడానికి డిజైనర్లు చెట్ల కొమ్మలతోనే ఫర్నిచర్‌ తయారుచేస్తున్నారు.

Updated : 29 Feb 2024 16:45 IST

నిద్రలేచిన వెంటనే ప్రకృతిలో మమేకమై ఉన్నట్లు అనిపిస్తే ఆ ఆనందమే వేరు. ఆ భావన రావడానికి డిజైనర్లు చెట్ల కొమ్మలతోనే ఫర్నిచర్‌ తయారుచేస్తున్నారు. హాలు నుంచి పడకగది వరకు వాటికి తగ్గట్లుగా రూపొందించి ఆకర్షణీయంగా మలుస్తున్నారు.

ముందుగదిలో... ఇంట్లోకి అడుగుపెట్టిన వెంటనే ముందు గదిలో పుస్తక ప్రియుల కోసం ప్రత్యేకంగా కొమ్మలతో అలమరలు వస్తున్నాయి. గోడకు వేలాడేలా, గదిలో ఓమూల ఇమిడిపోయేలా తయారవుతున్న ఈ బుక్‌షెల్ఫ్‌లు ప్రకృతిని దగ్గర చేస్తున్నాయి. గది మధ్యలో ఉండే సాధారణ షెల్ఫ్‌కు కొమ్మలతో ఇచ్చే ఫినిషింగ్‌ చూడచక్కగా ఉంటోంది. దీనికి మనీప్లాంట్‌ వంటివాటిని అల్లించుకుంటే చాలు. ఈ అలమరలను పిల్లల గదుల్లోనూ ఏర్పాటు చేసుకోవచ్చు. వారికిష్టమైన కథల పుస్తకాలతోపాటు బొమ్మలకూ చోటిస్తే చిన్నారుల ఆనందానికి అంతు ఉండదు.

గది మధ్యలో... హాలు పెద్దగా ఉన్నప్పుడు దాన్ని డైనింగ్‌ కోసం కొంతభాగాన్ని కొమ్మలతోనే విడదీయొచ్చు. అదెలాగంటే గది మధ్యలో చెట్ల కొమ్మలతో చేసిన ప్రత్యేక పార్టిషన్‌ గోడలా మారిపోతుంది. దానికి పక్కగా సోఫా వేస్తే చాలు.. చూడటానికి సిట్టింగ్‌ ఏరియాగా కనిపిస్తుంది. తోటలో ఉన్నట్లుగా అనిపించే ఈ తరహా ఫర్నిచర్‌ ఇంటికే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. పడకగదిలో దుస్తుల బీరువాను కూడా కొమ్మలతో తయారుచేస్తున్నారు. హ్యాంగర్స్‌ ఉండే ఈ కొమ్మల షెల్ఫ్‌లో షర్ట్స్‌, టాప్స్‌, శారీస్‌ వంటివన్నీ హ్యాంగ్‌ చేసుకోవచ్చు. చెవికమ్మలు, గొలుసులు, పట్టీలు, హ్యాంగింగ్స్‌ వంటి యాక్ససరీస్‌ కోసమూ కొమ్మల స్టాండులు తయారవుతున్నాయి.

ల్యాంప్‌ స్టాండ్స్‌... పడకగది, హాలులో ఉంచే నైట్‌ల్యాంప్స్‌ స్టాండ్స్‌ కూడా కొమ్మలతో తయారవుతున్నాయి. కొమ్మ చివర అందమైన ఆకారాల్లో నైట్‌ల్యాంప్స్‌ అమరుస్తున్నారు. గదికి అందాన్ని అద్దే ఈ ల్యాంప్స్‌ను హాల్‌లో కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. స్నానాల గదిలో టూత్‌బ్రష్‌లుంచేలా, దుస్తులను వేసేలా చిన్న కొమ్మల స్టాండ్స్‌ ఇంటిని అందంగా మారుస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్