ఫ్రిజ్‌లో వీటిని ఉంచొద్దు...

మిగిలిన ఆహారం, తెచ్చిన కూరగాయలు, పండ్లు, స్నాక్స్‌లో వేసుకునే సాస్‌ల నుంచి పచ్చళ్ల వరకు ఫ్రిజ్‌లో భద్రపరుస్తా. ఇలా ప్రతి వస్తువునూ ఫ్రిజ్‌లో పెట్టెయ్యద్దు అంటున్నారు ఆహారనిపుణులు. అవేంటంటే...

Updated : 23 Nov 2021 06:16 IST

మిగిలిన ఆహారం, తెచ్చిన కూరగాయలు, పండ్లు, స్నాక్స్‌లో వేసుకునే సాస్‌ల నుంచి పచ్చళ్ల వరకు ఫ్రిజ్‌లో భద్రపరుస్తా. ఇలా ప్రతి వస్తువునూ ఫ్రిజ్‌లో పెట్టెయ్యద్దు అంటున్నారు ఆహారనిపుణులు. అవేంటంటే...

* తేనె... దీన్ని ఫ్రిజ్‌లో ఉంచితే గట్టిగా మారుతుంది. రుచిలోనూ తేడా వస్తుంది. సహజంగా తయారయ్యే తేనెను ఎన్నాళ్లు బయట ఉంచినా రుచి మారదు. అలాగే ఆలివ్‌ నూనె, కాఫీపొడిలను గది వాతావరణంలోనే ఉంచాలి. లేదంటే ఫ్లేవర్‌ పోతుంది. హాట్‌ సాస్‌ కూడా ఫ్రిజ్‌లో వద్దు. వెనిగర్‌తో చేసేవి బయట ఉంచితేనే రుచి, ఘాటు తగ్గవు.

* పుదీనా.. కొత్తిమీర... పుదీనా, కొత్తిమీర వంటి వాటిని తేమని ఆరనిచ్చి, ఆ తర్వాతే భద్రపరుస్తుంటారు. దీంతో తాజాదనం తగ్గుతుంది. అలాగే చెమ్మదనం కూడా చేరి త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. అలాకాకుండా నీటితో నింపిన జార్‌లో వీటి కొమ్మల వేరుభాగాలు మునిగేలా ఉంచితే మూడు నాలుగు రోజులు తాజాగా ఉంటాయి. టొమాటోలను ఫ్రిజ్‌లో ఉంచితే మెత్తగా, మారి, త్వరగా పాడవుతాయి. ఉల్లి పాయలు పొడిబారి తేమ తగ్గుతుంది. వీటినీ బయట ఉంచితే మేలు.

* కెచప్‌.. టొమాటోలతో చేసే కెచప్‌ను ఫ్రిజ్‌లో భద్రపరచకూడదు. ఇందులోని వెనిగర్‌ ఈ పదార్థాన్ని పాడవకుండా కాపాడుతుంది. బ్రెడ్‌ కూడా ఫ్రిజ్‌లో పెడితే గట్టిపడుతుంది. అతి చల్లదనానికి త్వరగా పాడవుతుంది. బంగాళా దుంపలను ఉంచితే మెత్తబడి, వంటకు పనికిరావు. అవకాడోలను గది వాతావరణంలోనే ఉంచితే 2, 3 రోజుల్లో తినడానికి మెత్తగా, పండినట్లుగా అవుతాయి. ఫ్రిజ్‌లో పెడితే గట్టిపడి, పండకుండా వృథా అవుతాయి.

* పచ్చళ్లు... వీటిని ఫ్రిజ్‌లో ఉంచొద్దంటున్నారు ఆహారనిపుణులు. వీటిలోని నూనె గట్టిపడి రుచి తగ్గుతుంది. బయట ఉంచితేనే మేలట. వెల్లుల్లి, కారాలు, పీనట్‌బటర్‌కు కూడా గది వాతావరణమే మంచిది.

* పండ్లు... యాపిల్‌, అరటి, ఆప్రికాట్లు వంటి పండ్లు గది వాతావరణంలో మాత్రమే పాడవకుండా ఉంటాయి. గుమ్మడి కాయను ఫ్రిజ్‌లో ఉంచితే వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్‌ విలువలు తగ్గుతాయి. జీడిపప్పు, వేరుశనగ, పిస్తా, బాదం వంటి నట్స్‌ను ఫ్రిజ్‌లో పెడితే వాటిలోని సహజసిద్ధ నూనెలు పొడారిపోతాయి. పోషకవిలువలతోపాటు రుచి కూడా తగ్గుతుంది. కుకీస్‌, కేక్స్‌, పేస్ట్రీలను ఫ్రిజ్‌లో ఉంచితే గట్టిపడటమే కాదు, ఫ్లేవర్‌ కూడా మారుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్