సంతోషాలను అలంకరించేయండి

ఎన్ని ప్రదేశాలు తిరిగినా.. బయట ఎంత కష్టపడినా తిరిగి చేరుకోవాలనుకునే గమ్యం ఇల్లే. దీనికి కొన్ని హంగుల్ని అద్దితే.. ఒత్తిడి కూడా అలా తుడిచేసినట్లుగా పోవడమే కాదు.. మనసు ఆనందంతో నిండిపోతుంది అంటున్నారు ఇంటీరియర్‌ డిజైనర్లు.

Updated : 23 Dec 2021 05:22 IST

ఎన్ని ప్రదేశాలు తిరిగినా.. బయట ఎంత కష్టపడినా తిరిగి చేరుకోవాలనుకునే గమ్యం ఇల్లే. దీనికి కొన్ని హంగుల్ని అద్దితే.. ఒత్తిడి కూడా అలా తుడిచేసినట్లుగా పోవడమే కాదు.. మనసు ఆనందంతో నిండిపోతుంది అంటున్నారు ఇంటీరియర్‌ డిజైనర్లు.

* రంగులు.. గోల్డెన్‌ ఎల్లో, నారింజ వర్ణాలు సెరటోనిన్‌ ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. దీనికే హాపీనెస్‌ హార్మోన్‌ అనిపేరు. గోడలకు ఈ రంగులద్దేయండి. లేదా సూర్యుడి వెలుగులను ప్రతిబింబించేలా గోడలకు వాల్‌పేపర్‌/ ఇంటీరియర్‌ డిజైనింగ్‌ చేయించండి.

* ఫొటోలు.. మీకు నచ్చిన వారి, నచ్చిన ప్రదేశాలకు వెళ్లిన, సంతోషాన్ని గుర్తుచేసే ఫొటోలతో గోడను అలంకరించండి. చూడగానే పెదవులపై చిరునవ్వు వెల్లివిరియడం ఖాయం.

* మొక్కలు.. ఇంటిని పచ్చదనంతో నింపేయండి. ఇండోర్‌ మొక్కలు, డెకరేషన్‌ కోసం వాడేవి ఏవైనా మూడ్‌ను మార్చేస్తాయి. ఇంటికీ జీవకళనిస్తాయి.

*మోడర్న్‌ లుక్‌.. మ్యూజిక్‌, యానిమల్‌, గ్రాఫిక్‌ ప్రింట్‌లున్న వాల్‌పేపర్లను ప్రయత్నించండి. దానికి తోడుగా మిక్స్‌ అండ్‌ మ్యాచింగ్‌ ఫర్నిచర్‌, కుషన్స్‌ జతచేస్తే మోడర్న్‌ లుక్‌తోపాటు కొత్త ఉత్సాహమూ మీ సొంతమవుతుంది.

*డెకరేటివ్స్‌.. పడక గదుల్లో ప్రశాంతతనిచ్చే ఆర్ట్‌ వర్క్‌, విగ్రహాలకు చోటివ్వాలి. వార్డ్‌రోబ్‌ డెకొలమ్‌/ వినైల్‌ ఎరుపు, నలుపు కలయికతో ఉండేలా చూసుకోండి. చూడగానే ఆకర్షించడమే కాదు ఉల్లాసాన్నీ కలిగిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్