కమ్మని కానుక..

అచ్చంగా కొబ్బరి బొండం, పట్టుచీర, యాపిల్‌ పండ్లలా ఉన్న ఇవన్నీ పశ్చిమ గోదావరి జిల్లా మహిళల సృజనాత్మకతకు ప్రతిరూపాలు. కోవాతో చూడముచ్చటగా తయారు చేసిన వీటిని వివాహ వేడుక సమయంలో వధువు తరఫు

Updated : 30 Jan 2022 06:34 IST

అచ్చంగా కొబ్బరి బొండం, పట్టుచీర, యాపిల్‌ పండ్లలా ఉన్న ఇవన్నీ పశ్చిమ గోదావరి జిల్లా మహిళల సృజనాత్మకతకు ప్రతిరూపాలు. కోవాతో చూడముచ్చటగా తయారు చేసిన వీటిని వివాహ వేడుక సమయంలో వధువు తరఫు వారు వరుడి కుటుంబానికి కానుకగా అందిస్తారు. స్థానికంగా వీటిని ‘కంత’గా పిలుస్తారు. భీమవరం పట్టణంలో కొందరు మహిళలు బృందంగా ఏర్పడి సాధారణ మిఠాయిలతో పాటు ఆర్డర్ల మేరకు వీటిని ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. పాలు, పంచదార, ఎండు ఫలాలు, కొబ్బరి, తేనెతో తయారు చేసే వీటిని కిలో రూ.600 నుంచి రూ.1200 వరకు విక్రయిస్తున్నారు.

- న్యూస్‌టుడే, భీమవరం పట్టణం


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్