మొక్కలకి నారింజ తొక్క!

నారింజ పండులోని ప్రతిభాగమూ మనకు మేలు చేసేదే. పండు అందానికీ, ఆరోగ్యానికీ తోడ్పడుతుంది. తొక్కలు చర్మ, కేశ సంరక్షణలో సాయపడతాయి. అంతేకాదు ఇవి మొక్కలకీ మేలు చేస్తాయని తెలుసా?....

Published : 17 Apr 2022 02:49 IST

నారింజ పండులోని ప్రతిభాగమూ మనకు మేలు చేసేదే. పండు అందానికీ, ఆరోగ్యానికీ తోడ్పడుతుంది. తొక్కలు చర్మ, కేశ సంరక్షణలో సాయపడతాయి. అంతేకాదు ఇవి మొక్కలకీ మేలు చేస్తాయని తెలుసా?

* ఒక గ్లాసు నీటికి కప్పు ఎండిన నారింజ తొక్కలను కలిపి 10 నిమిషాలపాటు మరిగించండి. ఆరిన తర్వాత నీటిని వడకట్టి మొక్కలపై స్ప్రే చేయండి. ప్రతి 3-4 రోజులకోసారి ఇలా చేస్తే చీమలు, గొంగలి పురుగు, తెల్లపురుగు వంటి వాటి నుంచి విముక్తి లభిస్తుంది. ఇండోర్‌ మొక్కలకీ దీన్ని వాడొచ్చు.

* తొక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి మొక్కల మొదల్లో వేయండి. వీటి నుంచి వచ్చే సిట్రస్‌ వాసనకి క్రిమి కీటకాలు దరిచేరవు. వేళ్లు తొలిచే పురుగులు నశిస్తాయి. ఇంకా దీనిలో ఉండే న్యూట్రియంట్లు మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి సాయపడతాయి. అయితే ఎండిన ప్రతిసారీ లేదా సుమారు రెండు వారాలకోసారి వీటిని మార్చాల్సి ఉంటుంది. కుళ్లాయి కదా అని గుజ్జుతో సహా మాత్రం వేయకండి. మేలు జరగకపోగా మొక్కల కీడుకే అవకాశమెక్కువ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్