వాటి బెడద ఉండదిక!

చెత్త రెండు మూడు రోజులు పడేయకపోయినా.. ఇంట్లో పండిన కూరగాయలు, పండ్లు ఉన్నా ఇక వచ్చేస్తాయండీ ఫ్రూట్‌ ఫ్లైస్‌. కాఫీ తాగిన కప్పులు కనిపించినా, వంట పాత్రల మీద మూత మరిచినా వాలిపోతుంటాయి.

Published : 24 Apr 2022 00:13 IST

చెత్త రెండు మూడు రోజులు పడేయకపోయినా.. ఇంట్లో పండిన కూరగాయలు, పండ్లు ఉన్నా ఇక వచ్చేస్తాయండీ ఫ్రూట్‌ ఫ్లైస్‌. కాఫీ తాగిన కప్పులు కనిపించినా, వంట పాత్రల మీద మూత మరిచినా వాలిపోతుంటాయి. ఓసారి వచ్చాయంటే ఇల్లంతా చుట్టేస్తుంటాయి. ఇవి కుట్టకపోయినా వీటితో ఆరోగ్యానికి హానే! వెళ్లగొట్టాలా... ఈ చిట్కాలు పాటించేయండి.

* పండ్లు కూరగాయలను ఇంటికి తెచ్చాక కడిగిన తర్వాతే భద్రపరచండి. పగిలిన, పండిన వాటి రసాలు వీటికి అంటినా అవి ఫ్రూట్‌ ఫ్లైస్‌ని ఆకర్షిస్తాయి. ఈ కాలంలో పండ్లు త్వరగా పాడైపోతాయి. కాబట్టి, రోజూ చూసుకోవాలి. పాడైనవి వెంటనే పడేయాలి.

* పావుకప్పు యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌ను ఒక చిన్న పాత్రలో పోసి, దానికి స్పూను డిష్‌వాష్‌ను కలిపి ఈ ఈగలు ఎక్కువగా ఉన్నచోట ఉంచండి. వాసనకు ఆకర్షితమై వచ్చి చనిపోతాయి.

* ఒక డిస్పోజబుల్‌ గ్లాస్‌లో బాగా పండిన అరటిపండు, తొక్కలు ఇంకా కుళ్లిన టమాటా వంటివి వేయాలి. దాని మూతిని ప్లాస్టిక్‌ కవర్‌తో మూసి చిన్న చిన్న రంధ్రాలు పెట్టాలి. ఫ్రూట్‌ ఫ్లైస్‌ వాటి వాసనతో లోపలికి వెళ్లిపోతాయి. కానీ బయటకు రాలేవు. ఆ మొత్తాన్ని ఒక కవర్‌లోకి తీసుకొని గట్టిగా కట్టేసి పడేస్తే సరి.

* ఒక చిన్న పాత్రలోకి మూడొంతులు నీళ్లు తీసుకోవాలి. దానికి రెండు చెంచాల చొప్పున పంచదార, వెనిగర్‌, డిష్‌వాష్‌ కలపాలి. దీన్ని ఈ చిన్న ఈగలు వాలేచోట పెడితే సరి. దీనిపై వాలి చనిపోతాయవి. కొన్నిరోజులు వరుసగా చేస్తే సమస్య తొలగిపోతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్