అపజయం... గెలుపు పాఠాలు నేర్పుతుంది

పరాజయం పలకరించిందా... భయపడొద్దు.. వెనక్కి తగ్గొద్దు... కడలి కెరటాలు కూడా పడి లేస్తాయి. కాబట్టి వైఫల్యాలు వచ్చినంత మాత్రాన కుంగిపోవద్దు. మనం నిర్ణయాల్ని రకరకాల పరిస్థితుల్లో తీసుకుంటాం. ఒక్కోసారి ఒక దారిలో పరాజయం పలకరించొచ్చు. అంత మాత్రాన అధైర్యపడొద్దు....

Published : 28 Jun 2021 01:01 IST

పరాజయం పలకరించిందా... భయపడొద్దు.. వెనక్కి తగ్గొద్దు... కడలి కెరటాలు కూడా పడి లేస్తాయి. కాబట్టి వైఫల్యాలు వచ్చినంత మాత్రాన కుంగిపోవద్దు.

కొత్త దారులు వెతకాలి...

మనం నిర్ణయాల్ని రకరకాల పరిస్థితుల్లో తీసుకుంటాం. ఒక్కోసారి ఒక దారిలో పరాజయం పలకరించొచ్చు. అంత మాత్రాన అధైర్యపడొద్దు. ఆ సమయంలో మన నిర్ణయాన్ని సమీక్షించుకోవాలి. ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకోవాలి. దాన్ని ఎలా సరిదిద్దుకోవాలో ఆలోచించాలి. అవసరమైతే ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి. మన ప్రశ్నలకు సరైన సమాధానం దొరికితే కొత్త ఉత్సాహంతో ముందుకు వెళ్లొచ్చు.

కొత్త విషయాలు నేర్చుకోండి...

కొన్ని కోల్పోయినప్పుడు వాటిని భర్తీ చేసుకోవడానికి కొత్తవాటిని నేర్చుకోవాలి. మీరెప్పుడైతే ఉత్సాహంతో కొత్తవి తెలుసుకోవాలనే నిర్ణయం తీసుకుంటారో సగం విజయం మీ సొంతమవుతుంది. ఒకసారి జరిగిన తప్పును తిరిగి చేయొద్దు. విజయం లభించే వరకు ప్రయత్నాలు ఆపొద్దు.

విజయానికి అవే మెట్లు...

అపజయాలు మనల్ని అశక్తులుగా మారుస్తాయి.  ఓటమినే విజయానికి మెట్లుగా మార్చుకునే ప్రయత్నం చేయండి. పడటం తప్పు కాదు. పడిన తర్వాత తిరిగి లేవాలనే ప్రయత్నం చేయకపోవడమే అసలైన వైఫల్యం. ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా లేవడమే మీ వ్యక్తిత్వాన్ని మరింత బలంగా మారుస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్