ఉద్యోగానికీ ముందస్తు ప్రణాళిక
close
Updated : 13/11/2021 05:15 IST

ఉద్యోగానికీ ముందస్తు ప్రణాళిక

లావణ్యకు చదువు పూర్తయ్యింది. కాలేజీలో ఉన్నప్పుడు వచ్చిన ఉద్యోగావకాశాన్ని కాదనుకుంది. మరిన్ని నైపుణ్యాలను పెంచుకోవడానికి మరికొంత సమయాన్ని తీసుకుంది. అనుకున్నది సాధించాలంటే ఓ ప్రణాళిక పాటించాలంటున్నారు నిపుణులు.

దరఖాస్తు నుంచి ఇంటర్వ్యూకు వరకు ఇప్పుడంతా ఆన్‌లైన్‌లోనే. సంస్థల్లో ఖాళీల వివరాలూ ఇక్కడే తెలుస్తున్నాయి. ఎప్పటికప్పుడు వాటిని సామాజిక మాధ్యమాల్లో శోధించాలి. మీ అర్హత, ఆసక్తికి తగ్గ ఉద్యోగాలున్న సంస్థను గుర్తించాలి. దాన్ని గురించి  క్షుణ్ణంగా తెలుసుకోవాలి. చాలా మంది ఉద్యోగులు వారి అభిప్రాయాలు, అనుభవాలను సోషల్‌ మీడియాలో రాస్తున్నారు. వాటినీ చదవాలి. ఇవన్నీ ఆ సంస్థపై ఓ అవగాహన కలిగిస్తాయి.  

పోటీకి తగ్గట్లు... పోటీలో గెలవడానికి రెజ్యూమె మీ ముందడుగు. వ్యక్తిగత వివరాలు, అర్హతలతోపాటు ప్రాజెక్టులపరంగా సాధించిన విజయాలను ఇందులో పొందుపరచాలి. చదువుపరంగా శిక్షణ వివరాలనూ ఉంచాలి. పొందిన ప్రశంసల ప్రస్తావనా ఉండాలి. ప్రొఫెషనల్‌ కవరింగ్‌ లెటర్‌ తప్పనిసరి. దరఖాస్తును చూసిన వెంటనే చదువుతోపాటు ప్రాజెక్టుల్లో మీ విజయాలు వారికి తేలిగ్గా అర్థమయ్యేలా ఉండాలి.

ప్రాజెక్టులపై... ఎంచుకున్న సంస్థలో ప్రాజెక్టులపై వివరాలను తెలుసుకున్న తర్వాతే దరఖాస్తు చేయాలి. ఇంటర్వ్యూకు పిలుపు రాకపోతే నిరాశపడొద్దు. ఒకటికన్నా ఎక్కువ చోట్ల అప్లై చేస్తే మంచిది. శిక్షణ ఇచ్చి, ప్రాజెక్టులను కేటాయించేచోట అడుగుపెడితే ఉత్తమం.

ఫీడ్‌బ్యాక్‌... అప్లికేషన్‌ను నిరాకరించిన సంస్థ నుంచి ఫీడ్‌బ్యాక్‌ తప్పక తీసుకోవాలి. దాంతో పెంచుకోవాల్సిన నైపుణ్యాలు, అర్హతలపై అవగాహన వస్తుంది.ఆ అంశాలన్నింటినీ ఛాలెంజ్‌గా తీసుకుంటూ ఆత్మవిశ్వాసంతో ప్రయత్నిస్తే నచ్చిన కెరియర్‌లో స్థిరపడొచ్చు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని