మొదటిసారి కలిసినప్పుడు..

మీరో అంకుర పరిశ్రమను ప్రారంభిస్తున్నారు. పెట్టుబడుల కోసం వ్యాపారవేత్తల్ని సంప్రదించాలి. లేదా మరేదో కీలకమైన సమావేశానికి హాజరవ్వాలి....

Updated : 09 Dec 2022 12:44 IST

మీరో అంకుర పరిశ్రమను ప్రారంభిస్తున్నారు. పెట్టుబడుల కోసం వ్యాపారవేత్తల్ని సంప్రదించాలి. లేదా మరేదో కీలకమైన సమావేశానికి హాజరవ్వాలి. అలాంటి సందర్భంలో ఎదుటివారికి మీపై మంచి అభిప్రాయం కలగాలంటే.. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

* మొదటి సారి ఒకవ్యక్తిని కలిసినప్పుడు మనమెంత సంస్కారంగా మాట్లాడుతున్నా మన ఆహార్యం, హావాభావాలే ఎదుటివారిని ఎక్కువ ఆకట్టుకుంటాయి. మాటలకంటే నాలుగురెట్లు ఎక్కువగా మన భావోద్వేగాలు కీలకపాత్ర పోషిస్తాయి. అందుకే మొదటిసారి చిరునవ్వుతో మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవాలి.
* ఉద్యోగానికి సంబంధించిన ముఖాముఖి జరుగుతున్నప్పుడు... అధికారి కూర్చోమనగానే మరీ ముందుకు లేదా మరీ వెనక్కి కూర్చోకూడదు. ఆత్మవిశ్వాసంతో సౌకర్యంగా కూర్చోవాలి. ఒక వేళ అతను కూర్చోమనకపోతే... మీరే అతనికి ఎదురుగా ఉండే కూర్చీలో కూర్చోవచ్చు.
* అలంకరణ ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. అలాగే భారీ నగలు పెట్టుకోకూడదు. నగలు వీలైనంత తక్కువగా ఉండాలి. దుస్తులే కాదు.. ధరించే పాదరక్షల విషయంపైనా దృష్టి పెట్టండి. సందర్భానికి తగిన శిరోజాలంకారం కూడా ఉండాలి.
* ముఖానికి చేసుకునే అలంకరణ కూడా ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. అప్పుడే హుందాగా కనిపిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్