దానాలతో అగ్రస్థానం!

ప్రపంచంలోనే అతి శక్తిమంతమైన మహిళగా ఫోర్బ్స్‌ పట్టికలో ఈ ఏడాది మెకంజీ స్కాట్‌ అగ్రస్థానంలో నిలిచారు. దాతృత్వంలో తనకు తానే సాటిగా నిలిచి ఈ స్థానాన్ని సాధించారీ కలియుగ దానకర్ణి.

Published : 10 Dec 2021 00:33 IST

ప్రపంచంలోనే అతి శక్తిమంతమైన మహిళగా ఫోర్బ్స్‌ పట్టికలో ఈ ఏడాది మెకంజీ స్కాట్‌ అగ్రస్థానంలో నిలిచారు. దాతృత్వంలో తనకు తానే సాటిగా నిలిచి ఈ స్థానాన్ని సాధించారీ కలియుగ దానకర్ణి.

చయిత్రిగా, అమ్మగా నలుగురు పిల్లల బాధ్యతలను చూసుకుంటూనే యాంటీ బుల్లీయింగ్‌ గ్రూపును ప్రారంభించారు మెకంజీ. 1990లో భర్త ప్రారంభించిన ‘అమెజాన్‌’ వ్యవహారాల్లోనూ తోడుగా నిలిచారు. 2019లో భర్త నుంచి విడిపోయాక సంక్రమించిన ఆస్తిలో కనీసం సగమైనా దానధర్మాలకు వినియోగిస్తానని ప్రకటించడమే కాదు, రెండేళ్లలోపే తన ఆలోచనను ఆచరణలో పెట్టారీమె. ఇప్పటికే 8.6 బిలియన్‌ డాలర్లను ప్రపంచవ్యాప్తంగా 780 సామాజిక సేవాసంస్థలకు విరాళమిచ్చారు. ఈ ఏడాదికే ఆమె దానం చేసిన మొత్తం 2.7 బిలియన్‌ డాలర్లు. లింగవివక్ష, సమానత్వం, ప్రజారోగ్యం, మహిళా సాధికారత, పేద మహిళలకు ఉద్యోగావకాశాల కల్పించే సంస్థలకు ఆర్థిక చేయూతనందించారు. ‘సంపద అతి కొద్దిమంది వద్ద పోగుపడటం కంటే.. అది ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మంచి పనులకు ఉపయోగిస్తేనే దానికి సార్థకత. ఇవ్వడంలో సంతోషమూ దాగి ఉంది’ అంటున్నారు మెకంజీ.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్