తెల్లజుట్టుతో పెళ్లిపీటలెక్కింది!

తల్లో ఒక్క తెల్లవెంట్రుక కనిపించగానే తల్లడిల్లిపోతాం. డై వేసేస్తాం. మామూలప్పుడు కాస్త బద్ధకించినా ఫంక్షన్‌ అంటే మరింత అందంగా ముస్తాబవుతాం. అలాంటిది పెళ్లి, పెళ్లికూతురూ మనమే అన్నప్పుడు ఇంకెంత దృష్టిపెడతాం? కానీ ఒకమ్మాయి తెల్ల వెంట్రుకలతోనే పెళ్లిపీటల మీదకెక్కి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Updated : 18 Dec 2021 04:32 IST

తల్లో ఒక్క తెల్లవెంట్రుక కనిపించగానే తల్లడిల్లిపోతాం. డై వేసేస్తాం. మామూలప్పుడు కాస్త బద్ధకించినా ఫంక్షన్‌ అంటే మరింత అందంగా ముస్తాబవుతాం. అలాంటిది పెళ్లి, పెళ్లికూతురూ మనమే అన్నప్పుడు ఇంకెంత దృష్టిపెడతాం? కానీ ఒకమ్మాయి తెల్ల వెంట్రుకలతోనే పెళ్లిపీటల మీదకెక్కి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆత్మవిశ్వాసానికి మించిన అందం లేదని, ధైర్యానికి సాటైన ఆభరణమూ లేదని నిరూపిస్తోంది. ఇది జరిగిందీ మన దేశంలోనే! పైగా ఆమె ఒక సెలబ్రిటీ కూతురు కూడా!

బాలీవుడ్‌ నటుడు దిలీప్‌జోషి కుమార్తె నియతికి ఇటీవలే పెళ్లైంది. మూడు ముళ్లు వేయించుకున్న తన ముద్దుల కుమార్తె ఫొటోలను దిలీప్‌ తాజాగా  ఇన్‌స్టాలో ఉంచారు. దానిలో తెల్ల జుట్టుతో ఉన్న నియతిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆమె ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యానికి జోహార్లు అంటూ ప్రశంసించడం మొదలుపెట్టారు.

‘ఆత్మవిశ్వాసమే అసలైన అందం. నీపై నీ నమ్మకాన్ని ప్రదర్శించిన తీరు అద్భుతం’ అంటూ పొగుడుతున్నారు. మామూలుగానే అమ్మాయిలు అందానికి, అందులో భాగమైన కురులకీ ప్రాధాన్యమిస్తారు. వివాహమంటే మరింత అందంగా సిద్ధమవుతారు. అయితే నియతి మాత్రం తన తెల్లని జుట్టును దాచే ప్రయత్నం చేయకుండా ధైర్యంగా పెళ్లిమండపంలోకి అడుగుపెట్టింది. ఎవరైనా హేళన చేస్తారనో, అవమానిస్తారనో అనుకోలేదామె. సామాజికపరంగా ఒత్తిడిని ఎదుర్కోవల్సి వస్తుందన్న ఆలోచనకూ తావివ్వలేదు. ఆత్మస్థైర్యం తొణికిసలాడుతున్న కళ్లతో సంతోషంగా వరుడు యశోవర్ధన్‌తో ఏడడుగులు వేసిన ఆమె మోములో అందం రెట్టింపుగా కనిపించింది. ఆ అందానికి కారణం ఆమె ఆత్మవిశ్వాసమే అంటున్నారు  అభిమానులందరూ.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్