డెలివరీ తర్వాత బెల్టు వాడితే పొట్ట తగ్గుతుందా?

హలో డాక్టర్‌. నాకు డెలివరీ తర్వాత ట్యుబెక్టమీ చేశారు. పొట్ట తగ్గడానికి బెల్టు పెట్టుకోమన్నారు. కానీ నేను దానికి బదులు చీర ఉపయోగిస్తున్నా. దీనివల్ల నిజంగానే పొట్ట తగ్గుతుందా? మళ్లీ బెల్టు/చీర వాడడం ఆపేశాక పొట్ట పెరుగుతుందా? - ఓ సోదరి

Published : 18 Jan 2022 20:07 IST

హలో డాక్టర్‌. నాకు డెలివరీ తర్వాత ట్యుబెక్టమీ చేశారు. పొట్ట తగ్గడానికి బెల్టు పెట్టుకోమన్నారు. కానీ నేను దానికి బదులు చీర ఉపయోగిస్తున్నా. దీనివల్ల నిజంగానే పొట్ట తగ్గుతుందా? మళ్లీ బెల్టు/చీర వాడడం ఆపేశాక పొట్ట పెరుగుతుందా? - ఓ సోదరి

జ. నార్మల్‌ డెలివరీ/సిజేరియన్‌ జరిగిన వెంటనే కొద్ది రోజుల పాటు పొట్ట బాగా వదులుగా, ఎలాంటి ఆసరా లేనట్లుగా అనిపిస్తుంది.. కాబట్టి బెల్టు ఉపయోగించమని డాక్టర్లు చెబుతారు. కానీ నిజానికి బెల్టు వాడడం వల్ల కండరాల్లో బలం పెరిగి తిరిగి యథాస్థితికి రావడం గానీ, పొట్ట తగ్గిపోవడం కానీ జరగదు. అలాగే బెల్టు, చీర వాడడం ఆపేశాక.. తిరిగి వదులుగానే అనిపిస్తుంది. కాబట్టి మీకు పొట్ట తగ్గిపోవాలంటే వ్యాయామం చేయడం ఒక్కటే మార్గం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్