Health: ఆ.. నొప్పి!
ఏదో బరువు ఎత్తినట్లు మెడ నుంచి భుజాల వరకూ అప్పుడప్పుడూ నొప్పిగా అనిపించడం గమనించారా! అదే పనిగా కంప్యూటర్ ముందు కూర్చొనే వాళ్లకే కాదు.. వంటగదిలో గంటలకొద్దీ నిలబడి పనిచేసినా ఇది వస్తుంటుంది.
ఏదో బరువు ఎత్తినట్లు మెడ నుంచి భుజాల వరకూ అప్పుడప్పుడూ నొప్పిగా అనిపించడం గమనించారా! అదే పనిగా కంప్యూటర్ ముందు కూర్చొనే వాళ్లకే కాదు.. వంటగదిలో గంటలకొద్దీ నిలబడి పనిచేసినా ఇది వస్తుంటుంది. త్వరిత ఉపశమనం కావాలా? వీటిని ప్రయత్నించండి.
* వీలుంటే పని పక్కన పెట్టి, కాస్త పడుకోవడం లాంటివి చేయండి. తగ్గలేదూ.. ఏదైనా వస్త్రంలో ఐసు ముక్కలుంచి నొప్పి ఉన్న ప్రాంతంలో నేరుగా చర్మానికి తాకేలా పెట్టండి. 10-20 నిమిషాలు ఉంచితే నొప్పి దూరమవుతుంది. రోజులో కనీసం 3-4 సార్లు ఇలా చేస్తే చాలు.
* చేతులను ముందుకు చాచి, ఒక్కో చేతిని సవ్య, అపసవ్య దిశల్లో వృత్తాకారంలో తిప్పాలి. ఇలా 5-10 నిమిషాలు చేసినా ఉపశమనం దొరుకుతుంది.
* కుర్చీలో నిటారుగా కూర్చోవాలి. చేతులను అలాగే ఉంచి, భుజాలతో చెవులను తాకుతున్నట్లుగా చేయాలి. అలా 10-20 సార్లు చేసి చూడండి. ఆపై నిటారుగా కూర్చొని మెడ వంచి తల భుజానికి ఆనేలా కొన్ని సెకన్లపాటు ఉంచాలి. ఇరువైపులా కొద్దిసేపు ఇలా చేస్తే ఫలితం ఉంటుంది.
* గోరువెచ్చని నీటిలో కాస్త కళ్లుప్పు వేసుకొని స్నానం చేసినా వాపు కారణంగా వచ్చే నొప్పు తగ్గుతుంది. లేదూ వేడినీటి కాపడమైనా సరిపోతుంది. అయితే నేరుగా చర్మంపై పెట్టకుండా చూసుకోవాలి.
* చేతులను పక్కకీ, ముందుకీ చాచడం.. కిందకి దించడం; కుర్చీలో మెడను వెనక్కి వాల్చినట్లు కూర్చున్నా మంచిదే. పొడుస్తున్నట్టుగా వచ్చే ఈ నొప్పి శరీరం విశ్రాంతి కోరుతోందన్న దానికి చిహ్నమే నంటారు నిపుణులు. అదే పనిగా కూర్చొని లేదా నిల్చొని ఉంటున్నామని అనిపిస్తే మధ్య మధ్యలో నడవడం, కాసేపు చేతులు, మెడ స్ట్రెచింగ్ వంటివి చేస్తే ఈ సమస్య దరిచేరదు. ఇవి చేశాకా అదుపులోకి రాకపోతే మాత్రం వైద్యుల సలహా తప్పనిసరి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.